CM Chandrababu Meet : ఏపీ సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందుకేనా..
కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూశాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి...
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ(సోమవారం) సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి మరికాసేపట్లో కలవనున్నారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి. కలిసి మాట్లాడనున్నారు. మర్యాద పూర్వకంగా చంద్రబాబు(CM Chandrababu)తో బీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే లెటర్స్ అనుమతించాలని చంద్రబాబును నేతలు కోరనున్నారు.
మరోవైపు.. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తన ముఖ్య అనుచరులతో గతంలో మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీలో చేరే విషయంపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. తిరిగి సొంతగూటికి చేరే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే 2014 వరకు మల్లారెడ్డి టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీలో ఎంపీగానూ పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో బీఆర్ఎస్లో చేరి మంత్రిగా పనిచేశారు. అయితే మరోసారి మల్లారెడ్డి టీడీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు మల్లారెడ్డి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు(CM Chandrababu)ను మల్లారెడ్డి కలవడం హాట్ టాపిక్‌గా మారింది.
CM Chandrababu Meet…
కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూశాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణపై పట్టు సాధించడానికి బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ క్రమంలో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే బీఆర్ఎస్కు బై.. బై చెప్పేసి పసుపు కండువా కప్పుకోనున్నారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి సంస్థల చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీకి జోష్ వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాడులు తగ్గాలంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరుతానని తన అనుచరులతో మల్లారెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో మల్లారెడ్డి ఈ పదవీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబుతో ఉన్న పరిచయాలతో ఆయన టీటీడీపీలోకి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Also Read : Minister Lokesh : యువగళం పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం