MLC Kavitha Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి కవిత అరెస్ట్

అనంతరం ఆమెను చంద్రాయాణ గుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు...

MLC Kavitha : తెలంగాణ జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్ భవన్‌ను ముట్టడించేందుకు ఆమె ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించారు.దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దాంతో కవిత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

MLC Kavitha Arrest

దీంతో కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను చంద్రాయాణ గుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటోందని, విద్యార్థులు, ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కవితను చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో జాగృతి కార్యకర్తలు సైతం భారీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Also Read : CM Chandrababu : అనంతపురం ఆడపిల్ల ఘటనపై సీఎం చంద్రబాబు ఘరమ్

Leave A Reply

Your Email Id will not be published!