BRS WIN 2023 : బీఆర్ఎస్ అడ్డా గులాబీదే జెండా
ఇండియా టీవీ సర్వేలో వెల్లడి
BRS WIN 2023 : తెలంగాణ – రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా పెద్ద ఎత్తున కుప్పలు తెప్పలుగా సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. శివ కేశవ్ స్థాపించిన మిషన్ కాకతీయ సంస్థ బీఆర్ఎస్ కు 44 శాతం ఓట్లు వస్తాయని కనీసం 72 నుంచి 78 సీట్లు వస్తాయని ప్రకటించారు. ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
BRS WIN 2023 Survey Viral
కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. ఈ తరుణంలో తాజాగా దేశంలో పేరు పొందిన ప్రముఖ ఛానల్ ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఈ సందర్బంగా తెలంగాణలో గెలవ బోయేది బీఆర్ఎస్(BRS) జెండానేనని స్పష్టం చేశాయి.
మొత్తం రాష్ట్రంలో 119 సీట్లకు గాను భారత రాష్ట్ర సమితి పార్టీకి 70 సీట్లు వస్తాయని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా సీట్లు వస్తాయని ఆ పార్టీకి 34 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 7 సీట్లు, ఎంఐఎం 7 సీట్లు, ఒక సీటు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని కుండ బద్దలు కొట్టింది ఇండియా టీవీ – సీఎన్ ఎక్స్ సర్వే .
ఇదిలా ఉండగా ఓట్ల శాతం ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కు 43 శాతం, కాంగ్రెస్ కు 37 శాతం, బీజేపీకి 11 శాతం, ఎంఐఎం 3 శాతం , ఇతరులు 6 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ ప్రకటించింది.
Also Read : Minister KTR : బీఆర్ఎస్ ఏ పార్టీకి బి టీం కాదు