Buddhavanam : బుద్ధవనం ప్రారంభానికి సిద్దం
తెలంగాణకు గర్వ కారణం
Buddhavanam : తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మహా బౌధ్ద(Buddhavanam) ఆధ్యాత్మిక కేంద్రం బుద్దవనం శనివారం ప్రారంభం కానుంది. దీనిని కేటీఆర్ తో పాటు వీఎస గౌడ్ ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా దీనిని జాతికి అంకితం చేయనున్నారు.
కృష్ణా నది ఒడ్డున నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది చేసింది. బుద్దవనం(Buddhavanam) అనే మెగా బౌద్ద థీమ్ పార్కును పర్యాటకుల కోసం ప్రారంభించనున్నారు.
ఆసియా లోనే అతి పెద్ద బౌద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించ బడుతున్న బుద్దవనం రూ. 100 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. క్రీ. శ. 3వ శతాబ్దానికి చెందిన అనేక సాంస్కృతిక అవశేషాలతో కూడిన బౌద్ద అవశేషాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్టు సైట్ కు ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల నుంచి దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉందని బుద్దవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ వెల్లడించారు.
క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నాగార్జునసాగర్ , దాని పరిసర ప్రాంతాలు ఒకప్పుడు ప్రధాన బౌద్ధ(Buddhavanam) కేంద్రాలుగా విలసిల్లాయని తెలిపారు. క్రీ. శ. 3వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపం ఉంది.
ఇది ఒక సహజమైన గుహ లోపల ఒక వేదికపై ఉంది. ఇది ఒకప్పుడు చరిత్ర పూర్వ మానవుని నివాసం కావడం విశేషం. బుద్దవనం ప్రాజెక్టు ఎనిమిది నేపథ్య విభాగాలుగా చేశా.రు
బుద్ద చరిత వనం, జాతక వనం, (బోధిసత్వ ఉద్యానవనం), ధ్యాన వనం, స్తూప వనం, మహా స్థూపం, బౌద్ద విద్యా కేంద్రం, హాస్పిటాలిటీ యూనిట్లు, వెల్ నెస్ సెంటర్ ఉంది.
Also Read : దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం