Congress Chance : మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ కు ఛాన్స్

సి డైలీ ట్రాక‌ర్ స‌ర్వేలో సంచ‌ల‌నం

Congress Chance : క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ ను కోల్పోయింది. దీంతో దాని ప్ర‌భావం చాలా చోట్ల క‌నిపించే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌లు రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా త్ర‌యం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసినా ఫ‌లితం భిన్నంగా వ‌చ్చింది. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌లకు దిగింది.

ఈ తరుణంలో త్వ‌రలో మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లో ఉంది. తాజాగా ఆ రాష్ట్రంలో ప్ర‌ముఖ సంస్థ సి డైలీ ట్రాక‌ర్ స‌ర్వే చేప‌ట్టింది. ఈ మేర‌కు మొత్తం రాష్ట్రంలో 230 సీట్ల‌కు గాను ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌జ‌ల ప‌ల్స్ ను ప‌సిగ‌ట్టింది. తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా శుక్ర‌వారం కీల‌క వివ‌రాలు వెల్ల‌డించింది.

అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎదురు గాలి వీస్తోంద‌ని పేర్కొంది. ఆ పార్టీ ఇక‌నైనా మేలుకోక పోతే క‌ష్ట‌మ‌ని హెచ్చ‌రించింది. ఇక కాషాయానికి 79 నుంచి 85 సీట్లు వ‌స్తాయ‌ని వెల్ల‌డించింది. ఇక కాంగ్రెస్(Congress) పార్టీకి 135 సీట్ల నుంచి 143 సీట్ల దాకా వ‌స్తాయ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇత‌రులు 8 నుంచి 12 సీట్లు గెలుపొందే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. ఇటీవ‌ల ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో గెల‌వ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : DK Shiva Kumar : ప్ర‌జ‌లు దేవుళ్లు..ప్ర‌భువులు – డీకే శివ‌కుమార్

 

Leave A Reply

Your Email Id will not be published!