C T Kurien: ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత !
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత !
C T Kurien: ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్ (93) చెన్నైలో కన్నుమూశారు. కురియన్ మృతిపై తమిళనాడుతో పాటు కేంద్రంలో పలువురు సంతాపం వ్యక్తం చేసారు. 1953లో మద్రాస్ క్రిస్టియన్ కళాశాల నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. పేదరికంపై ఎలాంటి చర్చలు లేకపోవడంతో ఆయన ఆర్థికశాస్త్రంలో ప్రత్యేకత సాధించాలనుకున్నారు. అలా 1958-1963 మధ్య స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ‘ఫ్యాక్టర్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టెక్నలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ అండర్ డెవలప్‌డ్ కంట్రీ: యాన్ ఇండియన్ కేస్ స్టడీ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు.
C T Kurien No More
1968-69 మధ్య యేల్ వర్సిటీలో కురియన్ విజిటింగ్ ఫెలోగా చేశారు. 1962-78 మధ్య మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో ఆచార్యులుగా, 1978-91 మధ్య మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఆచార్యులుగా చేసి 1978 నుంచి 1988 వరకు డైరెక్టర్‌గా, యూజీసీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చిలో నేషనల్ ఫెలోగా సేవలందించారు. 2000 సంవత్సరంలో ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్థికశాస్త్రంపై 15 రకాల పుస్తకాలు రాశారు.
Also Read : Supreme Court of India: కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం కోర్టు నోటీసులు !