Caller Name Display : కాలర్ పేరు తప్పనిసరి కాదు
ట్రాయ్ కి టెలికాం సంస్థలు
Caller Name Display : ట్రూ కాలర్ అనేది తప్పనిసరి కాదని స్పష్టం చేశాయి టెలికాం సంస్థలు. ఈ మేరకు ఇదే విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ కమిషన్ (ట్రాయ్) కు వెల్లడించాయి. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్పీ) అనేది ఒక సప్లిమెంటరీ సర్వీస్ . ఇది ఎవరైనా కాల్ చేసినప్పుడు ఫోన్ స్క్రీన్ లపై ఎవరు కాల్ చేస్తున్నారనే విషయం తెలుస్తుంది.
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు కాలర్ నేమ్ డిస్ ప్లే(Caller Name Display) ఐచ్ఛికంగా ఉండాలని సీఓఏఐ స్పష్టం చేసింది. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ)ని అమలు చేయడం తప్పనిసరి చేయకూడదని, టెలికాం ఆపరేటర్లకు ఐచ్చికంగా ఉంచాలని ఇండస్ట్రీ బాడీ వాదించింది. ఎందుకంటే అసోసియేషన్ తన పాయింట్ ను వాదించేందుకు సాంకేతిక , గోప్యత, వ్యయ సంబంధిత ఆందోళనలను రెగ్యులేటర్ కమిషన్ ట్రాయితో పంచుకుంది.
టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ లలో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ) సప్లిమెంటరీ సర్వీస్ ను ప్రవేశ పెట్టాల్సిన అవసరంపై టెలికాంగ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన సంప్రదింపు ప్రక్రియలో భాగంగా సమర్పణలు ఉన్నాయి. సీఎన్ఏపీ అనేది ఒక అనుబంధ సేవ. ఇది ఎవరైనా కాల్ చేసినప్పుడు ఫోన్ స్క్రీన్ లపై కాలర్ పేరు ఫ్లాష్ అయ్యేలా చేస్తుంది.
రిలయన్స్ , జియో, భారతీ ఎయిర్ టెల్ , వొడా ఫోన్ ఐడియాతో కూడిన సీఓఏఐ, సీఎన్ఏపీ తప్పనిసరి కాకూడదు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఐచ్చికంగా ఉండాలని పేర్కొంది. యూజర్లకు సంబంధించిన సమాచారం, గోప్యత అనేది లేకుండా పోతుందని ట్రాయ్ హెచ్చరించింది.
Also Read : తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్