Sourav Ganguly : ఎప్పటికీ అడ్మినిస్ట్రేటర్ గా ఉండలేను
స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ
Sourav Ganguly : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) వైదొలగనున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బంధన్ బ్యాంక్ ఈవెంట్ లో గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎల్లకాలం , ఎప్పటికీ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలకుడు)గా ఉండలేనని స్పష్టం చేశాడు.
ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అక్టోబర్ 18న బీసీసీఐ కొత్త కార్యవర్గం ఎన్నికవుతుంది. ఇదిలా ఉండగా గంగూలీ బోర్డు చీఫ్ గా కొనసాగాలని కోరుకున్నట్లు నివేదికలు వచ్చాయి. కానీ ఇతర సభ్యుల నుండి ఆయనకు మద్దతు లభించ లేదు. ఈ విషయంపై అధికారికంగా బీసీసీఐ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
కాగా గంగూలీ మాత్రం తాను వేరే ఏదైనా నిర్వహిస్తానని పేర్కొనడం గమనార్హం. తాను చాలా కాలం పాటు పరిపాలకుడిగా ఉన్నానని, ఇప్పుడు వేరే దానికి వెళ్లాలని చూస్తున్నట్లు చెప్పాడు. ఏ ఆటగాడైనా భారత జట్టు తరపున ఆడాలని అనుకుంటారు. నేను జట్టు కోసం ఆడాను. నా వంతు ప్రయత్నం చేశాను. నాకు ఎందరో సహకరించారు.
ఇదే సమయంలో బీసీసీఐ బాస్ గా నాదైన ముద్ర కనబర్చేందుకు యత్నించానని తెలిపాడు. తాను క్రికెటర్ గా రాణించేందుకు ఆనాటి కెప్టెన్ అజహరుద్దీన్ ను మరిచి పోలేనని పేర్కొన్నాడు గంగూలీ. ఏక కాలంలో ఆటగాడిగా, పాలకుడిగా ఉండడం సాధ్యం కాదన్నాడు గంగూలీ. ఒక్క రోజులో అంబానీ లేదా మోదీ కాలేరన్నాడు.
రాహుల్ ద్రవిడ్ ను వన్డే జట్టు నుంచి తొలగించినప్పుడు నేను అండగా నిలబడ్డానని చెప్పాడు. సాధించిన పరుగులే కాదు ఇతర విషయాలు కూడా గుర్తు పెట్టుకుంటారని కుండ బద్దలు కొట్టాడు సౌరవ్ గంగూలీ.
Also Read : గంగూలీపై టీఎంసీ..బీజేపీ గొడవ