Amber Heard : నష్ట పరిహారం చెల్లించలేం – అంబర్
జాన్ డెప్ పరువు నష్టం కేసు వ్యవహారం
Amber Heard : యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కేసు ఏదైనా ఉందంటే అది హాలీవుడ్ కు చెందిన నటీ నటుల పరువు నష్టం కేసు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగింది.
ఒకరు దిగ్గజ నటుడు జానీ డెప్ కాగా మరొకరు మాజీ భార్య నటి అంబర్ హియర్డ్(Amber Heard). తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని, మానసికంగా చిత్ర హింసలు పెట్టాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
ఈ మేరకు 2018లో ఓ పత్రికలో దీనిపై వ్యాసం కూడా రాసింది. ఆ తర్వాత తనకు జానీ డెప్ నష్ట పరిహారం చెల్లించాలంటూ అమెరికాలోని వర్జీనియా కోర్టును ఆశ్రయించింది.
విచారణ అనంతరం ఇరువురి వాదనలు విన్న ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ కీలక తీర్పు వెలువరించింది. జానీ డెప్ , అంబర్ హియర్డ్(Amber Heard) వ్యవహారంలో తప్పంతా మాజీ భార్య అంబర్ హియర్డ్ దేనని తేల్చింది.
ఈ మేరకు ఇద్దరిదీ తప్పున్నా వేధింపుల విషయానికి వస్తే ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది. ఈ మేరకు రూ. $ 10 మిలియన్ డాలర్లను నష్ట పరిహారంగా జానీ డెప్ కు ఇవ్వాలని జ్యూరీ తీర్పు చెప్పింది.
దీంతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది మాజీ భార్య అంబర్ హియర్డ్ కు. ఇంత భారీ ఎత్తున శిక్ష విధిస్తే ఎలాగని అంబర్ హియర్డ్ తరపు లాయర్ పేర్కొన్నారు.
అంత పెద్ద మొత్తంలో జానీ డెప్ కు చెల్లించే పరిస్థితిలో తన క్లయింట్ లేదని స్పష్టం చేశారు. నటి తీర్పుపై మరోసారి అప్పీల్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
మొత్తంగా ఈ వ్యవహారం కొంత కాలం యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది.
Also Read : ఇది ఊహించని దెబ్బ – అంబర్ హియర్డ్