Azaharuddin HCA : అజ‌హ‌రుద్దీన్..హెచ్‌సీఏపై కేసు న‌మోదు

ఆఫ్ లైన్ లో కాదు ఆన్ లైన్ లో మాత్ర‌మే

Azaharuddin HCA : సెప్టెంబ‌ర్ 25న ఆదివారం హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగే భార‌త్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ కు సంబంధించి టికెట్ల ర‌గ‌డ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ చీఫ్ , మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ అజ‌హ‌రుద్దీన్, హెచ్ సీ ఏ ను బాధ్యులుగా చేస్తూ కేసు న‌మోదు చేశారు.

ఇప్ప‌టికే టికెట్ల కోసం తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారంతా య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

దీంతో ఇవాళ టికెట్ల విక్ర‌యానికి సంబంధించి వ‌స్తున్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌పై మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ (Azaharuddin HCA) క్లారిటీ ఇవ్వ‌నున్నారు. ఇక ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఆఫ్ లైన్ టికెట్ల కోసం ఫ్యాన్స్ జింఖానా గ్రౌండ్ కు రావ‌ద్ద‌ని కోరారు. గ్రౌండ్ వ‌ద్ద ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి మాత్ర‌మే టికెట్లు అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా వెయిట్ చేస్తున్నారు. నిన్న చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో అజ్జూ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వీరికి జింఖానా వ‌ద్ద‌నే టికెట్లు అంద‌జేస్తామ‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా దీనికి పూర్తి బాధ్య‌త ప్రెసిడెంట్, హెచ్ సీఏనంటూ మంత్రి గౌడ్ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ర‌శీదు, ఆధార్ కార్డు తీసుకు రావాల‌ని సూచించారు అజ‌హ‌రుద్దీన్.

ఇప్ప‌టికే 32 వేల టికెట్లు అమ్ముడు పోయాయ‌ని ప్ర‌క‌టించారు. ఇవి ఎవ‌రి బొక్క‌లోకి పోయాయంటూ అభిమానులు నిల‌దీస్తున్నారు. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు మూడు కేసులు న‌మోదు చేశారు పోలీసులు. ఆయ‌న ఏం చెబుతార‌నేది ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : చ‌రిత్ర సృష్టించిన రిజ్వాన్..బాబ‌ర్ ఆజం

Leave A Reply

Your Email Id will not be published!