CBDT : బ్యాంకు లావాదేవీలు మ‌రింత క‌ష్టం

ఖాతాదారుల‌కు కోలుకోలేని షాక్

CBDT : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం జ‌నాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. మేకిన్ ఇండియా, మ‌న్ కీ బాత్ , స్టార్ట‌ప్ ఇండియా పేరుతో ఎంత‌గా ప్ర‌చారం చేసినా ఆచ‌ర‌ణ‌లో మాత్రం డ‌బ్బున్న మారాజుల‌కే మేలు చేకూర్చేలా చేస్తోందంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా అమ్మ‌కానికి పెట్టింది స‌ర్కార్. ఇదే స‌మ‌యంలో కోట్లాది ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ఉంటూ విశిష్ట సేవ‌లు అందిస్తున్న బ్యాంకుల‌పై క‌న్ను ప‌డింది.

ఇంకేం వాటిని కూడా ప్రైవేటీక‌రించే ప‌నిలో ప‌డింది. మెల మెల్ల‌గా రూల్స్ మార్చుకుంటూ వ‌స్తోంది. ఆర్బీఐ చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం పై విపక్షాలు మండి ప‌డుతున్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

తాజాగా బ్యాంకింగ్ లావాదేవీల‌కు సంబంధించి రూల్స్ మార‌బోతున్నాయి. దేశంలో ఎక్కువ‌గా డ‌బ్బులు దాచుకుంటున్న‌ది పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌లే. ప్ర‌ధానంగా బ్యాంకుల కంటే పోస్టాఫీసుల‌లోనే ఖాతాలు తెర‌వ‌డం, జ‌మ చేయ‌డం జ‌రుగుతోంది.

ఇక నుంచి ఒక ఆర్థిక‌సంవ‌త్స‌రంలో రూ. 20 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ గ‌నుక బ్యాంకులో కానీ లేదా పోస్టాఫీసులో కానీ జ‌మ చేస్తే త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు స‌మ‌ర్పించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది ఆర్బీఐ.

ఈ రూల్స్ ను కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు(CBDT) ఖ‌రారు చేసింది. ఈనెల 10న దీనికి సంబంధించి నోటిఫికేష‌న్ జారీ చేయ‌డం విశేషం. ఈ ఏడాది మే 26 నుంచి అమ‌లులోకి తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌కటించింది. ఈ రూల్స్ అన్ని ఖాతాల‌కు వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించింది.

 

Also Read : ఎలోన్ మ‌స్క్ కు కేంద్ర మంత్రి స‌పోర్ట్

1 Comment
  1. Satyanarayana Pasumarthi says

    20 లక్షలు transactions చేస్తే పెద్దవాడు ఎలా?

Leave A Reply

Your Email Id will not be published!