CBDT Raids : త‌మిళ‌నాడు సంస్థ‌ రూ. 400 కోట్ల ప‌న్ను ఎగ‌వేత

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వెల్ల‌డి

CBDT Raids : సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడిటి) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. త‌మిళ‌నాడులో ఈనెల 15 నుంచి జ‌రిపిన ఇన్ కం టాక్స్ దాడుల్లో పెద్ద ఎత్తున ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించిన‌ట్లు సోమ‌వారం వెల్ల‌డించింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలిపింది సీబీడీటి(CBDT Raids). త‌మిళ‌నాడు ఆధారిత గ్రూపులపై దాడులు జ‌రిపామ‌ని దాదాపు రూ. 400 కోట్ల రూపాయ‌ల మేర ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డిన‌ట్లు తేలింద‌ని స్ప‌ష్టం చేసింది.

స‌ద‌రు సంస్థ‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న చెన్నై, విలుప్పురం, కోయంబ‌త్తూరు, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లోని 40కి పైగా స్థలాల‌పై ఆదాయపు ప‌న్ను శాఖ దాడులు చేప‌ట్టింద‌ని వెల్ల‌డించింది.

కాగా ఆదాయ ప‌న్ను శాఖ ఏ సంస్థ అన్న‌ది మాత్రం బ‌య‌ట‌కు వెళ్ల‌డించ లేదు. ఇదిలా ఉండ‌గా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మ‌ద్యం త‌యారీ, ఆతిథ్యం రంగాల‌లో నిమ‌గ్నై ఉన్న సంస్థ‌గా తెలిపింది.

ఇది త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన గ్రూప్ గా తెలిపింది. స‌ద‌రు సంస్థ రూ. 400 కోట్ల రూపాయ‌ల‌కు మించి ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డింద‌ని, ఈ విష‌యం విస్తృతంగా ఏక కాలంలో జ‌రిపిన దాడుల్లో బ‌య‌ట ప‌డింద‌ని సీబీడీటీ(CBDT Raids) ప్ర‌క‌టించింది.

ఈ దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 3 కోట్ల విలువైన న‌గ‌దు, రూ. 2.5 కోట్ల విలువైన లెక్క‌ల్లో చూపని బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపింది. లాజిస్టిక్స్ , వినోదం, ఆతిథ్యం, మ‌ద్యం త‌యారీలో నిమ‌గ్న‌మై ఉంది ఈ గ్రూప్ అని సీబీడీటీ పేర్కొంది.

Also Read : బిగ్ డీల్ పై ఎయిర్ ఇండియా ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!