DHFL Fraud : ముడుపులిచ్చారు కోట్లు కొల్లగొట్టారు
డీహెచ్ఎఫ్ఎల్ రూ. 34, 615 కోట్లు మోసం
DHFL Fraud : భారత దేశ చరిత్రలో మరో భారీ మోసం బయట పడింది. ఇదే అతి పెద్ద స్కాంగా పేర్కొనడం విశేషం. ఈ దేశంలో దొంగలు పడ్డారు. ఏకంగా ఒకటి కాదు వందలు కాదు రూ. 34,615 కోట్ల మోసానికి పాల్పడ్డారు.
అంతా పేరొందిన వారే. ఈ దారుణ మోసం గురించి కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఇందుకు సంబంధించి దివాన్ హౌసింగ్ ఫైన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) , దాని ప్రమోటర్లు మాజీ సీఎండీ కపిల్ విద్వాన్ , డైరెకటర్ ధీరజ్ వాధ్వాన్ లపై కేసు నమోదు చేసింది.
మొత్తం వీరంతా కలిశారు. భారీ స్కెచ్ వేశారు. ముడుపులు చెల్లించారు. భారీ కోట్లు కొల్లగొట్టారు. ఏకంగా 17 బ్యాంకులకు టోకరా పెట్టారు. సీబీఐ
నమోదు చేసిన బ్యాంకింగ్ కేసులలో ఇదే భారీ స్కాం కేసు కావడం విశేషం. 20న కేసు నమోదు చేసింది.
ముంబైలో అమరెల్లస్ రియల్టర్స్ చీఫ్ సుధాకర్ శెట్టి, మరో 8 మంది బిల్డర్లకు చెందిన 12 ఆవరణల్లో 50 మంది తో కూడిన టీం సోదాలు చేపట్టింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వద్ద డీహెచ్ఎఫ్ఎల్ చేసిన మోసం(DHFL Fraud) గురించి ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగింది సీబీఐ. తీగ లాగితే డొంకంతా కదిలింది. 2010 నుంచి 2018 మధ్య కాలంలో యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని
17 బ్యాంకుల కన్సార్టియం రూ. 42,871 కోట్ల మేర రుణం ఇచ్చింది.
కపిల్ , ధీరజ్ వాధ్వాన్ లు 2019 మే నుంచి రుణానికి సంబంధించి రుణ చెల్లింపుల్ని ఎగవేశారు. ప్రజా ధనాన్ని మళ్లించారు. ఖాతా పుస్తకాలను తారుమారు చేసినట్లు ఆడిలో స్పష్టమైంది.
దీంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాయి. బ్యాంకులు ఇచ్చిన నిధులను అనుబంధ సంస్థలకు, డైరెక్టర్లు, వ్యక్తులకు మళ్లించినట్లు కేపీఎంజీ
ఆడిట్ తేల్చింది. 66 సంస్థలు, వ్యక్తులకు రూ. 29,100 కోట్లు ఇచ్చారు.
Also Read : తమిళనాడు సంస్థ రూ. 400 కోట్ల పన్ను ఎగవేత