Rishi Agarwal : భారత దేశంలో అతి పెద్ద బ్యాంకు మోసానికి సంబంధించి ఏబీజీ షిప్ యార్డు మాజీ చైర్మన్ రిషి అగర్వాల్(Rishi Agarwal) ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రశ్నించింది.
ఏజెన్సీ సోదాలు కూడా ఆయన ఇంట్లో చేపట్టింది. అనంతరం సమన్లు కూడా జారీ చేసింది. 28 బ్యాంకులను రూ. 22 వేల 842 కోట్ల మోసానికి పాల్పడ్డారు రిషి అగర్వాల్ తో పాటు మరికొందరు.
ఏబీజీ షిప్ యార్డు లిమిటెడ్ దాని మాజీ డైరెక్టర్లు రిషి అగర్వాల్ , సంతానం ముత్తు స్వామి, అశ్విని కుమార్ లపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు ప్రకారం ఏబీజీ షిప్ యార్డు కంపెనీ తమ బ్యాంకుకు రూ. 2 వేల 925 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. 7 వేల 89 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ. 3 వేల 634 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 1, 614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ. 1,,244 , రూ. 1, 228 కోట్ల బకాయిలు ఉన్నాయి.
ఆయా బ్యాంకులకు లోన్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఏబీజీ షిప్ యార్డు మాజీ సీఎండీ రిషి అగర్వాల్(Rishi Agarwal) తో పాటు మరో 8 మందిపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి అన్ని బ్యాంకులకు కలిపి రూ. 22 వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు తేల్చేశారు. రిషి కమలేష్ అగర్వాల్ తో పాటు మరో ఎనిమిది మందిపై సీబీఐ ఫోకస్ పెట్టింది.
అయితే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన మొత్తం నిందితులు భారత దేశంలోనే ఉన్నారని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
Also Read : టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్