CM Chandrababu :చంద్రబాబు మిర్చి రైతులపై రాసిన లేఖకు స్పందించిన కేంద్రం
మిర్చి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి చర్చిస్తున్నారు...
CM Chandrababu : మిర్చి రైతుల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తితో కేంద్రంలో కదలిక వచ్చింది. మిర్చి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలిస్తున్నారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. పథకం కింద వీలైనంత ఎక్కువ సాయం చేసే ప్రతిపాదనను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. చంద్రబాబు నాయుడు(CM Chandrababu) విజ్ఞప్తితో తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను నిన్న (గురువారం) శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలతోనూ సమన్వయం చేసుకుని పరిష్కారం కనుగొనాలని చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.
CM Chandrababu Letter-Union Minister Responds
ఏపీసీఎం విజ్ఞప్తి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలతో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు. ఏపీ మిర్చి రైతులకు చేయూత విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్(Shivraj Singh Chauhan)తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉన్నతాధికారులు శుక్రవారం భేటీ అయ్యారు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి పలువురు అధికారులు పాల్గొన్నారు.
నిన్నటిఢిల్లీ పర్యటనలో ప్రధానంగా మిర్చి రైతుల సమస్యలపై చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారు. ఏపీ మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందు చంద్రబాబు కీలక ప్రతిపాదనలు ఉంచారు. మార్కెట్ జోక్యం పథకం కింద కేంద్ర ప్రభుత్వం 25% పంట కొనుగోలు సీలింగ్ తొలగించి సాధ్యమైనంత ఎక్కువ పంట కొనుగోలు చేయాలని ఏపీ సీఎం వినతి చేశారు. ఐసీఏఆర్ నిర్ణయించిన మిర్చి ధరలు ఏపీ రైతుల సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఖరారు చేసినట్లు కనిపిస్తోందని… వాటిని సరిదిద్దాలన్నారు చంద్రబాబు. మిర్చి కొనుగోలు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు ఎలా పంచుకోవాలో ఆలోచన చేయాలని ఆయన తెలిపారు. మిర్చి ఎగుమతులను స్థిరీకరించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. బాబు విజ్ఞప్తితో తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.
Also Read : Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్ ‘సౌరవ్ గంగూలీ’ కి బెంగాల్ లో రోడ్డు ప్రమాదం