Ashwini Vaishnaw : ఏపీకి కేంద్రం తీపి క‌బురు

వైజాగ్ రైల్వే జోన్ త్వ‌ర‌లో

Ashwini Vaishnaw :  ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి మోదీ బీజీపీ ప్రభుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఇప్ప‌టికే పేరుకు పోయిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ప‌దే ప‌దే విన్న‌విస్తూ వ‌స్తోంది ఏపీ.

ఇదే స‌మ‌యంలో ఢిల్లీకి వెళ్లిన ప్ర‌తిసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ చంద్ర షాతో సీఎం జ‌గ‌న్(CM Jagan) ఏపీకి నిధులు ఇవ్వాల‌ని కోరుతున్నారు. మ‌రో వైపు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలో భాగంగా విశాఖ ప‌ట్ట‌ణానికి సంబంధించి రైల్వే జోన్ కావాల‌ని కోరుతూ వ‌చ్చారు.

పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో ప్ర‌తిసారి ఎంపీలు ప‌దే ప‌దే దీనిని ప్రస్తావించారు. ఏపీకి సంబంధించి పెద్ద ఎత్తున రాక పోక‌లు కొన‌సాగుతూ వుంటాయి విశాఖ రైల్వే స్టేష‌న్ నుంచి. దీనిని ప్ర‌స్తావించారు. మ‌రో వైపు విశాఖ రైల్వే జోన్ ప్ర‌క‌టించ‌డంలో కేంద్రం సుముఖంగా లేద‌ని టీడీపీ ఆరోప‌ణ‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో సాక్షాత్తు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్(Ashwini Vaishnaw) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

విశాఖ‌ప‌ట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్ట‌బ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. వైజాగ్ లో రైల్వే జోన్ కు అవ‌స‌ర‌మైన భూమి (స్థ‌లం) అందుబాటులో ఉంద‌ని ప్ర‌క‌టించారు.

దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి స్పందించారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వ దూర‌మైని మంత్రి ప్ర‌క‌ట‌న‌తో తేలి పోయింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా వైజాగ్ లో గ‌నుక రైల్వే జోన్ ఏర్పాటు చేయ‌క పోతే తాను ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు మ‌రోసారి.

Also Read : ఉద్యోగులు..పెన్ష‌న‌ర్ల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!