PM Kisan : ఆ రైతులకు పీఎం కిసాన్ బందంటున్న కేంద్ర సర్కార్
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది...
PM Kisan : దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) యోజన 20వ విడత ముప్పై రోజుల్లోపు విడుదలయ్యే అవకాశముంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యే ఈ పథకాన్ని పొందేందుకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
PM Kisan Updates
ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారులందరూ ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన వివరాలను సక్రమంగా నవీకరించుకోవాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా, జూలై 20న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లోని మోతీహరి పట్టణంలో పర్యటించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అదే రోజు ఆయన 20వ విడతను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయవలసిన ముఖ్యమైన పనులు ఇవే:
ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి
రైతులు తమ e-KYC ప్రక్రియను పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. ఇది www.pmkisan.gov.in వెబ్సైట్ ద్వారా లేదా CSC (Common Service Centre) సెంటర్లలో OTP లేదా బయోమెట్రిక్ ఆధారంగా పూర్తిచేయవచ్చు.
ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ చేయాలి
డబ్బు బదిలీ అవ్వాలంటే ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో తప్పకుండా లింక్ చేయాలి. లింక్ కాని ఖాతాలకు నగదు బదిలీ అవదు.
ఖాతా వివరాల సరిచూసుకోండి
IFSC కోడ్, ఖాతా నంబర్ వంటి వివరాలు తప్పులేమీ లేనట్టు సరిచూసుకోవాలి. తప్పుడు సమాచారం వల్ల డబ్బు మిస్ కావచ్చు.
భూమి రికార్డుల పటిష్టత
భూమి పత్రాలు పూర్తి స్థాయిలో ఉండాలి. ఎలాంటి లోపాలుంటే స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి సరిచేయాలి.
లబ్ధిదారు స్థితి తనిఖీ
www.pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లి “Beneficiary Status” విభాగంలో లాగిన్ అవ్వాలి. అక్కడ నుంచి మునుపటి వాయిదాల సమాచారం కూడా తెలుసుకోవచ్చు.
మొబైల్ నంబర్ అప్డేట్ చేయడం
OTP, పథకం అప్డేట్స్ రావాలంటే మొబైల్ నంబర్ తాజాగానే ఉండాలి. పాత నంబర్ ఉంటే అప్రమత్తత ఉండదు.
మొబైల్ నంబర్ అప్డేట్ విధానం:
- https://pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
- “Farmer Corner” సెక్షన్లోకి వెళ్లి
- “Update Mobile Number” పై క్లిక్ చేయండి
- ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ID నమోదు చేయండి
- కాప్చా ఎంటర్ చేసి సమర్పించండి
- కొత్త నంబర్ నమోదు చేసి ఫైనల్ సబ్మిట్ చేయండి
ఏం జరుగుతుంది ఈ దశలు పూర్తి చేయకపోతే?
ఈ దశలు పూరించని రైతులకు ఈ విడత నగదు జమ కాకపోవచ్చు. ముఖ్యంగా డేటా లోపాలు, KYC పూర్తి కాకపోవడం, ఆధార్ లింక్ చేయకపోవడం వల్ల వాయిదా నిలిచిపోయే అవకాశముంది.
ప్రస్తుతానికి అంచనా తేదీ
మొత్తానికి, జూలై 20 నాటికి లేదా ఆ తరువాత కొన్ని రోజుల్లోపు రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో 20వ వాయిదా జమ అయ్యే అవకాశముంది. కానీ అప్పటికి ముందే అవసరమైన దశలు పూర్తి చేసుకుంటేనే లబ్ధి పొందవచ్చు.
రైతులు అప్రమత్తంగా ఉండి, తమ వివరాలను తిరిగి ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read : Radhika Yadav Murder Mystery : టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ హత్యపై వెలుగులోకి కీలక అంశాలు
