Minister Bandi Sanjay : తెలంగాణ మాజీ సీఎంపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యమన్నారు...
Minister Bandi Sanjay : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Minister Bandi Sanjay) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లమని అన్నారు. అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేదన్నారు. కేసీఆరే దశమ గ్రహం… నవగ్రహాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్‌కు ‘నో ఎంట్రీ బోర్డు’ పెట్టేశారని… ఇగ రీ ఎంట్రీ కలే అంటూ విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ‘హైడ్రామా’లాడుతున్నరని మండిపడ్డారు. ‘‘ దేశ ప్రజలారా… కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి’’ అంటూ పిలుపునిచ్చారు. అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను తాను సన్మానిస్తానని… ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే అంటూ ధీమా వ్యక్తం చేశారు.
Minister Bandi Sanjay Slams..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యమన్నారు. లౌకికవాదులారా…. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరని అడిగారు. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు తన ద్రుష్టిలో భారతీయులే కాదన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు. రాహుల్…. క్విట్ ఇండియా అంటూ వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా? అంటూ మండిపడ్డారు. రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Kamala Vs Trump : తొలిసారి లైవ్ డిబేట్ లో పాల్గొన్న ట్రంప్, కమలా హ్యారిస్