Delhi Govt vs Centre : దేశ రాజధాని ఢిల్లీ ఎవరి ఆధీనంలో ఉండాలనే దానిపై మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం మధ్య లడాయి మొదలైంది.
ఆధిపత్య పోరు, పంచాయతీ చివరకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టుకు చేరింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తరపు వాదనలు విన్నది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పౌర సేవల నియంత్రణపై కేంద్రంపై ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారిస్తోంది.
ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్ లపై తమ నియంత్రణను సమర్థించుకుంది కేంద్రం.
దేశ రాజధాని లో పరిపాలనపై తమకు ప్రత్యేక పవర్స్ ఉండాలని సుప్రీంకోర్టుకు తెలిపింది.
దీనిపై ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం తీరుపై (Delhi Govt vs Centre )అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశ రాజధాని కాబట్టి ఢిల్లీపై కచ్చితంగా అధికారాలు ఉండాలని అభిప్రాయ పడింది కేంద్రం.
ఢిల్లీ దేశానికి తలమానికం. యావత్ ప్రపంచమంతా భారత్ ను ఢిల్లీ ద్వారానే చూస్తోందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇది ఏ ప్రత్యేక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు.
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కీలకం అని పేర్కొంది. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలని కేంద్రం సూచించింది.
ఈ సూచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పష్టం చేశారు.
శాసనసభ పవర్స్ పై ఇంతకు ముందు బెంచ్ లు ఏం చెప్పాయనే దానిపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆరా తీశారు.
కేంద్రం సూచనపై ఢిల్లీ ప్రభుత్వ అభిప్రాయాలను కోరింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఆప్ ప్రభుత్వం రాజధానిని నియంత్రించేందుకు ,
ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ను కేంద్రం ఉపయోగించు కుంటోందని ఆరోపించింది.
ఢిల్లీ ప్రభుత్వం కేవలం భూమి, పోలీసు, పబ్లిక్ ఆర్డర్ కాకుండా ఇతర విషయాలపై చట్టాలను ఆమోదించకుండా నిరోధించ వచ్చని గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఆప్ ప్రభుత్వం శాసన అధికారల సరిహద్దులను నిర్ణయించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ద్వారా తాజా రూపాన్ని కేంద్రం కోరింది. 2018లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పోలీసు, భూమి, ప్రజా శాంతి కేంద్రానికి సంబంధించింది.
మిగిలినవన్నీ ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి కేంద్రం వాదనలు రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బ తీస్తున్నాయని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
మొత్తంగా దేశంలో బీజేపీ యేతర రాష్ట్రాలలోనే వివాదాలు నెలకొనడం విశేషం.
Also Read : కోస్తా తీరం కన్నీటి సంద్రం