Chandra Babu Naidu : జైల్లో నాకు ప్రాణహాని ఉంది
నారా చంద్రబాబు నాయుడు
Chandra Babu Naidu : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ కోర్టు ఈ కేసుకు సంబంధించి రిమాండ్ పొడిగించింది.
Chandra Babu Naidu Letter Viral
తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu). తనకు జైల్లో ప్రాణ హాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తనకు కల్పిస్తున్న భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా జైలులో అడుగు పెడుతున్న దృశ్యాలను లీక్ చేశారని ఆయన ఆరోపించారు. తనను భౌతికంగా అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎస్పీకి అజ్ఞాత వ్యక్తి రాసినా ఇప్పటి వరకు స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ రిమాండ్ ఖైదీ పెన్ కెమెరాతో ఫోటోలు తీసినట్లు తనకు తెలిసిందని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. అంతే కాదు సామాజిక మాధ్యమాలలో తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు .
ఇదిలా ఉండగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.
Also Read : Gorantla Madhav : బాబు చస్తాడు జగన్ సీఎం అవుతాడు