Chandra Babu Naidu : బాబు పిటిషన్ పై జడ్జి విముఖత
విముఖత చూపిన జస్టిస్ భట్టి
Chandra Babu Naidu : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏపీ సీఐడీ స్కిల్ స్కాం కేసులో రూ. 371 కోట్లు చేతులు మారాయని, దీనికి ప్రధాన కారణం బాబేనని ఆరోపించింది. ఈ మేరకు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఏసీబీ కోర్టుకు నివేదించింది. దీనిపై జడ్జి హిమ బిందు సంచలన తీర్పు వెలువరించింది. రిమాండ్ విధించింది. పోలీస్ కస్టడీకి 2 రోజుల పాటు ఇచ్చింది కోర్టు.
Chandra Babu Naidu Petition Postponed
దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు తరపున లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా నారా చంద్రబాబుకు(Chandra Babu Naidu) చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణకు రావాల్సి ఉంది. కాగా విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్వీ భట్టి విముఖత చూపించారు.
దీంతో సుప్రీంకోర్టులో జరుగుతున్న చంద్రబాబు నాయుడు కేసు విచారణ మరో బెంచికి బదిలీ చేసింది. రేపటి నుండి సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో వచ్చే వారం విచారణకు రానుంది సుప్రీంకోర్టులో. మొత్తంగా బాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇదే సమయంలో తనయుడు నారా లోకేష్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ.
Also Read : Telangana High Court : గ్రూప్ -1 పరీక్ష రద్దు సబబే – హైకోర్టు