Chandra Babu Naidu : గెలిపిస్తే మ‌హిళ‌ల‌కు ఫ్రీ జ‌ర్నీ

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు

Chandra Babu Naidu : అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హామీల వ‌ర్షం కురుస్తోంది. అన్ని పార్టీలు ప్ర‌జ‌ల‌ను మెస్మ‌రైజ్ చేసే ప‌నిలో ప‌డ్డాయి. ఉచితాల‌కు తెర లేపారు. ఇప్ప‌టికే రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారినా దానిని ప్ర‌స్తావించ‌డం లేదు. అమ‌లుకు నోచుకోని హామీల‌ను కురిపిస్తూ వ‌స్తున్నారు.

Chandra Babu Naidu New Scheme

ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఏపీలో అడుగు పెట్టింది. ఈ త‌రుణంలో గ‌డువు తేదీ కంటే ముంద‌స్తుగా 20 రోజుల ముందే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని బాంబు పేల్చారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో 175 సీట్లు ఉన్నాయి. గ‌తంలో కావాలి జ‌గ‌న్ రావాలి జ‌గ‌న్ అంటూ పెద్ద ఎత్తున చేప‌ట్టిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌నం జై కొట్టారు. ఆయ‌న‌కు భారీ ఎత్తున సీట్లు వ‌చ్చేలా చేశాయి. ఈసారి కూడా వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు.

తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యానికి తెర తీశారు జ‌గ‌న్ రెడ్డి. త్వ‌ర‌లోనే రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించే ఆలోచ‌నలో ఉన్నారు. ఈ మేర‌కు ఆర్టీసీ అధికారుల‌ను ఆదేశించారు.

ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu Naidu) సైతం రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తామంటూ త‌న ప్ర‌చారంలో ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో ఇదే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది.

Also Read : Nirmala Sitharaman : స్టాలిన్ కామెంట్స్ నిర్మ‌ల సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!