Nirmala Sitharaman : స్టాలిన్ కామెంట్స్ నిర్మ‌ల సీరియ‌స్

ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని న‌గ‌దు ఇస్తున్నారు

Nirmala Sitharaman : త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. మీ అబ్బ సొత్తు ఏమైనా త‌మ‌కు ఇస్తున్నారా అంటూ వ్య‌క్తిగ‌త కామెంట్స్ చేశారు ఉద‌య‌నిధి. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.

Nirmala Sitharaman Serious on Udhayanidhi Stalin Comments

ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. స్థాయిని మ‌రిచి ఉద‌య‌నిధి మాట్లాడ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీ తండ్రి నీ తాత‌ను అడ్డం పెట్టుకుని నువ్వు రాజ భోగాలు అనుభించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు నిర్మ‌లా సీతారామ‌న్.

త‌మిళ‌నాడులో ఎవ‌డ‌బ్బ సొత్తు అని పంచి పెడుతున్నారంటూ నిల‌దీశారు. ప్ర‌జ‌ల‌కు నేరుగా డ‌బ్బుల‌ను వాళ్ల బ్యాంకు ఖాతాల్లో ఎందుకు వేయ‌డం లేదంటూ మండిప‌డ్డారు కేంద్ర మంత్రి(Nirmala Sitharaman). ఎందుకు ప్ర‌జ‌ల‌కు న‌గ‌దు పంపిణీ చేస్తున్నార‌ని నిల‌దీశారు. దీనిలో ఎంత సొమ్ము ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌కుండా మీరు నొక్కేస్తున్నారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నిర్మ‌లా సీతారామ‌న్.

Also Read : Prashant Kishor : చంద్ర‌బాబుతో పీకే భేటీ

Leave A Reply

Your Email Id will not be published!