Salaar Movie : స‌లార్ జోష్ ప్ర‌భాస్ ఖుష్

రికార్డుల మోత మోగిస్తోన్న స‌లార్

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , ల‌వ్లీ గ‌ర్ల్ శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ దుమ్ము రేపుతోంది. సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది. విడుద‌లైన తొలి షో నుంచి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూనే ఉంది. ఎక్క‌డ చూసినా ప్ర‌భాస్ మేనియా అగుపిస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ స‌లార్ స‌క్సెస్ తో ఫుల్ జోష్ లో కొన‌సాగుతోంది.

Salaar Movie

ఇదిలా ఉండగా ఈ ఏడాది చివ‌ర‌న రిలీజ్ అయిన స‌లార్ చిత్రం ఊహించ‌ని రీతిలో సునామీ సృష్టిస్తోంది. ఈ ఏడాది విడుద‌లైన షారుక్ ఖాన్ ప‌ఠాన్ , జ‌వాన్ తో పాటు ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టించిన యానిమ‌ల్ సినిమాల రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది స‌లార్ మూవీ.

తొలి రోజే ఏకంగా రూ. 95 కోట్ల వ‌సూళ్లు సాధించ‌డం , ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే న‌మైద‌న రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది.

విడుద‌లైన అన్ని చోట్లా స‌లార్ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ప‌ఠాన్ చిత్రం తొలి రోజు రూ. 57 కోట్లు , జ‌వాన్ రూ. 75 కోట్లు , యానిమ‌ల్ మూవీ రూ. 63 కోట్లు సాధించ‌గా వీటిని అన్నింటిని తిర‌గ‌రాసి స‌లార్ రూ. 95 కోట్లు సాధించింది.

Also Read : Salaar Movie : స‌లార్ ఊచ‌కోత రికార్డుల మోత

Leave A Reply

Your Email Id will not be published!