Chandra Babu Security Comment : చంద్రబాబు భద్రమేనా..?
లోకేష్ ఆరోపణలు నిజమేనా
Chandra Babu Security Comment : దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భద్రతపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై ఏపీ సీఐడీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఏసీబీ కోర్టుకు సమర్పించింది. దీంతో విచారించిన కోర్టు రిమాండ్ కు పంపింది. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరినా జడ్జి నిరాకరించారు. మరో వైపు చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆరోగ్యంపై, ప్రత్యేకించి ఆయనకు సంబంధించిన భద్రతపై తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
Chandra Babu Security Comment Viral
చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన ఏకంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తన తండ్రిని జైలు లోనే అంతం చేసేందుకు కుట్ర పన్నారని, దీనికి కర్త, కర్మ, క్రియ అంతా స్కెచ్ వేసింది సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అంతకు ముందు నారా లోకేష్ హస్తినలో తన పెద్దమ్మ, బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ చీఫ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. అనంతరం ఏపీకి వచ్చిన వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రత్యేకించి తన తండ్రి మచ్చ లేని నాయకుడని పేర్కొన్నారు. ఖైదీలతో తన తండ్రిని పైకి పంపించేందుకు ప్లాన్ చేశారంటూ వాపోయారు. లోకేష్ అలా మాట్లాడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ స్వయంగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆరోగ్యంగా ఉన్నారని, చర్మ వ్యాధి ఉండడంతో స్వయంగా డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జైలులోకి వచ్చినప్పుడు బాబు బరువు 66 కేజీలు ఉండగా ప్రస్తుతం ఆయన బరువు 67 కేజీలకు పెరిగిందని అనారోగ్యంగా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని ప్రశ్నించారు.
మాజీ సీఎం, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రతి సెకను సీసీ టీవీ కెమెరాలు పని చేస్తాయని స్పష్టం చేశారు. లోకేష్ చేసిన ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేశారు. ఇలాంటివి రాజకీయాలు చేసేందుకు పనికి వస్తాయన్నారు. మొత్తంగా వయస్సు అయి పోయిన చంద్రబాబును చంపే కక్ష ఎవరికి ఉండి ఉంటుందని ప్రశ్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఉన్న సమయంలో ఎక్కువగా ఎన్ కౌంటర్లను చేయించిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇప్పుడు చిలుక పలుకులు పలికితే ఎలా అని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రభావితమైన నాయకుడు. ఆయన సెక్యూరిటీ పూర్తిగా సర్కార్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆయన భద్రతకు సంబంధించి పైకి ఎన్ని ఆరోపణలు చేసినా ఎలా ఉన్నారనేది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : Tirumala Brahmotsavam : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వేదఘోష