Chandrababu Naidu Comment : బాబు ప్లాన్ స‌క్సెస్ అవుతుందా

తెలంగాణ‌లో ఒంట‌రిగా..ఏపీలో పొత్తు

Chandrababu Naidu Comment : ఎవ‌రైనా వ‌య‌సు పెరిగే కొద్దీ రాజ‌కీయాలు ఎందుకు అని అనుకుంటారు. శేష జీవితం హాయిగా గ‌డ‌పాల‌ని అనుకుంటారు. కానీ ఉమ్మ‌డి ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మాత్రం వెరీ డిఫ‌రెంట్. ఆయ‌న వ‌య‌సు పెరిగే కొద్దీ మ‌రింత రాటు దేలుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టారు.

ఏపీలో కోల్పోయిన ప‌వ‌ర్ ను తిరిగి ద‌క్కించు కునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. త‌ను ఓ వైపు త‌న‌యుడు నారా లోకేష్ మ‌రో వైపు రాష్ట్రాన్ని జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నిక‌ల‌కు తాను ముందే ప్రిపేర్ అయ్యారు.

Chandrababu Naidu Comment Viral

ఇందులో భాగంగా తాజాగా 2047 పేరుతో టీడీపీ విజ‌న్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఏపీని ఎలా డెవ‌ల‌ప్ చేస్తాన‌నే దానిపై పూర్తి గా భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu). గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ చీఫ్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొట్టిన దెబ్బ‌కు భారీ ఎత్తున సీట్ల‌ను కోల్పోయింది తెలుగుదేశం పార్టీ.

కోల్పోయిన ప్రాభ‌వాన్ని తిరిగి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌గ‌న్ ను ఎదుర్కొనేందుకు ప్లాన్ చేసే ప‌నిలో ప‌డ్డారు. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ ఉద్య‌మంతో అడ్ర‌స్ లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీకి తిరిగి జీవం పోశారు.

ముదిరాజ్ సామాజిక ఓట్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో అదే కులానికి చెందిన కాసానికి పార్టీ చీఫ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. త్వ‌ర‌లో తెలంగాణ‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముంద‌స్తు గానే 119 సీట్ల‌కు గాను 115 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు.

దీంతో కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీ , వామ‌ప‌క్షాలు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి. వామ‌ప‌క్షాలు, ఎంఐఎం తో
బీఆర్ఎస్ క‌లిసి పోటీ చేయ‌నున్న‌ట్టు చూచాయిగా ప్ర‌క‌టించారు కేసీఆర్. తెలంగాణ‌లో టీడీపీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఆయ‌న ఎక్కువ‌గా ఏపీపైనే ఫోక‌స్ పెట్టారు. రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తులు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో జ‌న‌సేన‌, బీజేపీతో క‌లిసి పోటీ చేయ‌నున్నాయా అన్న‌ది తేలాల్సి ఉంది. మ‌రి చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) ప్ర‌క‌టించిన విధంగా విజ‌న్ వ‌ర్క‌వుట్ అవుతుందా అన్న‌ది వేచి చూడాలి. కొడుకు నారా లోకేష్ చేపట్టిన యువ గ‌ళం ఏ మేర‌కు ర‌క్షిస్తుందో చూడాలి.

ముంద‌స్తు వ్యూహాలు, విజ‌న్ తో ముందుకు వెళుతున్న చంద్ర‌బాబు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఏపీ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దొంగ ఓట్ల నిర్వాకంపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

మొత్తంగా చంద్ర‌బాబు నాయుడు స్ట్రాట‌జీ డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఇక ఏపీలో ఆక్టోప‌స్ లా అల్లుకు పోయింది వైసీపీ. దానిని ఢీకొనేందుకు టీడీపీ, జ‌న‌సేన‌, బీజ‌పీ క‌లిసి ఏ మేర‌కు ఎదుర్కొంటాయ‌నేది కాల‌మే స‌మాధానం చెప్పాలి. జ‌గ‌న్ రెడ్డి దూకుడు ను చంద్ర‌బాబు ఏ మేర‌కు అడ్డు క‌ట్ట వేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Also Read : LPG Price : వంట గ్యాస్ ధ‌ర త‌గ్గింపు

Leave A Reply

Your Email Id will not be published!