Chandrababu Naidu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ?

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ?

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 12న ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈనెల 9న నరేంద్రమోదీ… ప్రధానిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాతే చంద్రబాబు ప్రమాణం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముంది. ఈనెల 7న మరోసారి ఎన్డీయే సమావేశం జరగనుంది. ఈ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కానున్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆరోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. 9న సాయంత్రం కొత్త మంత్రివర్గంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.

Chandrababu Naidu….

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయఢంకా మ్రోగించింది. 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలుపొంది… ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది.

Also Read : Asaduddin Owaisi: బీఆర్‌ఎస్‌ది తప్పుడు వ్యూహం – అసదుద్దీన్ ఒవైసీ

Leave A Reply

Your Email Id will not be published!