Mayawati : పేర్లు మారిస్తే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు

న‌రేంద్ర మోదీ స‌ర్కార్ పై మాయావ‌తి ఫైర్

Mayawati : యూపీ మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావ‌తి నిప్పులు చెరిగారు. ఆమె తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను, తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. గ‌త కొంత కాలంగా చారిత్రాత్మ‌క ప్ర‌దేశాల‌ను, వాటి వెనుక ఉన్న చరిత్ర‌ను అర్థం చేసుకోకుండా కేవ‌లం వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో వ్య‌వ‌హరిస్తుండ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

తాజాగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో కొలువు తీరిన వాటిని మొఘ‌ల్ గార్డెన్స్ అని పిలుస్తారు. ఇది 75 ఏళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తున్న‌ది. తాజాగా కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఏకంగా మొఘ‌ల్ గార్డెన్స్ పేరును మార్చేసింది. ఇందుకు సంబంధించి జీఓ కూడా జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి కార్య‌ద‌ర్శి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ నెల నుంచి వ‌చ్చే మార్చి 26 దాకా ప్ర‌తి ఒక్క‌రు గార్డెన్స్ ను సంద‌ర్శించేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఇక పేరు మార్పుపై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం మాయావ‌తి(Mayawati) . ఇలా పేర్లు మార్చ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌న్నారు. ఈ విష‌యాన్ని ఎంత త్వ‌ర‌గా తెలుసుకుంటే అంత మంచిద‌ని హిత‌వు ప‌లికారు మాజీ సీఎం.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ 15 ఎక‌రాల‌లో విస్త‌రించి ఉంది. 150 ర‌కాల గులాబీలు, తులిప్స్ , ఆసియాటిక్ లిల్లీస్ , డాఫోడిల్స్ , ఇత‌ర అలంకార ప్రాయ‌మైన పుష్పాలు ఇందులో కొలువు తీరి ఉన్నాయి. దేశంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు పేరుకు పోయాయ‌ని వాటిని ప‌రిష్క‌రించేందుకు మోడీ దృష్టి పెడితే మంచిద‌ని సూచించారు బీఎస్పీ చీఫ్‌.

Also Read : ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌లను చ‌ద‌వాలి

Leave A Reply

Your Email Id will not be published!