CBI Charge sheet ABG : ఏబీజీ షిప్ యార్డ్ మాజీ చీఫ్ పై ఛార్జ్ షీట్
రూ. 23 వేల కోట్ల బ్యాంకు మోసం కేసు
CBI Charge sheet ABG : దేశంలోనే అత్యంత సంచలనం కలిగించిన కేసులలో ఏబీజీ షిప్ యార్డు కు సంబంధించిన స్కాం. ఏకంగా 23 వేల కోట్ల మోసం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏబీజీ షిప్ యార్డ్ మాజీ చీఫ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఛార్జ్ షీట్(CBI Charge sheet ABG) దాఖలు చేసింది.
ఏబీజీ గ్రూప్ కు సంబంధించి ఫ్లాగ్ షిప్ కంపెనీ, భారతీయ నౌకా నిర్మాణ పరిశ్రమలో ప్రధాన సంస్థ ఏబీజీ షిప్ యార్డు లిమిటెడ్. 2005 నుండి 2015 మధ్య కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని 28 బ్యాంకుల కన్సార్టియం రూ. 22,842 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
నవంబర్ 8, 2019న దేశంలోని అతి పెద్ద బ్యాంకుగా పేరొందిన ప్రభుత్వానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదట సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఏజెన్సీని మార్చి 12, 2020న కంపెనీ నుండి కొన్ని వివరణలు ఇవ్వాలంటూ దర్యాప్తు సంస్థ కోరింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ మాజీ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రిషి కమలేష్ అగర్వాల్ , మరో ఐదుగురితో పాటు 19 కంపెనీలపై రూ. 22, 842 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు ఈ కీలక బడా స్కాంకు సంబంధించి సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఈ విషయాన్ని అధికారికంగా దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉండగా అగర్వాల్ , ఇతర సహ నిందితులు భారత దేశంతో పాటు విదేశాలలో స్థిర, చరాస్తులలో పెట్టుబడులు పెట్టేందుకు రూ. 5,000 కోట్ల విలువైన బ్యాంక్ డబ్బును మళ్లించినట్లు సీబీఐ ఇప్పటి వరకు గుర్తించింది.
అగర్వాల్ కు చెందిన విలువైన ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
Also Read : ఫిఫా సంబురం కోట్లల్లో లాభం