Charu Sharma : బెంగళూరు వేదికగా నిర్వహిస్తున్న ఐపీఎల్ 2022 వేలం పాటలో అపశ్రుతి చోటు చేసుకుంది. వేలం పాట నిర్వహిస్తున్న సమయంలో నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్ ఉన్నట్టుండి కుప్ప కూలి పోయాడు.
దీంతో ఐపీఎల్ ఆక్షన్ ను అర్ధాంతరంగా నిలిపి వేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చారు శర్మను ఎంపిక చేశారు.
ఐపీఎల్ వేలం పాట ప్రారంభమైంది. కుప్ప కూలిన ఎడ్మీడ్స్ ను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని బీసీసీఐ వెల్లడించింది.
ఇక ప్రారంభమైన వేలం పాటను చారు శర్మ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హ్యూ పరిస్థితి కుదుటగా ఉందని విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.
భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైంది. చారు శర్మ(Charu Sharma) అద్భుతమైన క్రికెటర్. ప్రపంచ వ్యాప్తంగా పేరొందారు. క్విజ్ మాస్టర్ కూడా. ప్రో కబడ్డీ లీగ్ కి డైరెక్టర్ గా ఉన్నారు.
2008లో ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కు సిఇఓగా పని చేశాడు. జట్టు పేలవమైన ప్రదర్శనతో తప్పుకున్నాడు. చారు శర్మ మందిరా బేడీతో పోటీఈ పడ్డాడు.
టెలివిజన్ ప్రోగ్రామ్స్ లు, ఇతర ఈవెంట్స్ లలో క్విజ్ మాస్టర్ గా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం 10 మందికి పైగా ప్లేయర్లు అమ్ముడు పోయారు. 10 ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి.