Elon Musk Content : ట్విట్ట‌ర్ లో హానిక‌ర‌మైన కంటెంట్ కు చెక్

స్ప‌ష్టం చేసిన బాస్ ఎలాన్ మ‌స్క్

Elon Musk Content : ప్ర‌ముఖ ర్యాప‌ర్ కాన్వే వెస్ట్ ట్విట్ట‌ర్ ఖాతాను స‌స్పెండ్ చేసింది ట్విట్ట‌ర్. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. ఈ విష‌యం చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో తీవ్రంగా స్పందించారు టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్.

ఎంద‌రినో ఊచ‌కోత కోసి చ‌రిత్ర‌లో న‌ర‌హంత‌కుడిగా పేరొందిన హిట్ట‌ర్ ను కీర్తిస్తూ కామెంట్స్ చేయ‌డం వ‌ల్ల‌నే తాము చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు పూర్తిగా అకౌంట్ ను తొల‌గించ లేద‌ని , తాత్కాలికంగా నిషేధం విధించిన‌ట్లు తెలిపారు ఎలాన్ మ‌స్క్. 

ట్విట్ట‌ర్ లో కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని పేర్కొన్నారు. ఇక నుంచి అభ్యంత‌ర‌క‌ర‌మైన‌, హానిక‌ర‌మైన‌, ప్ర‌పంచాన్ని ఇబ్బందికి గురి చేసే కంటెంట్ ఉంటే(Elon Musk Content) వెంట‌నే తొల‌గిస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా ఓ టీం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని వెల్ల‌డించారు ఎలాన్ మ‌స్క్. భ‌ద్ర‌త‌, న‌మ్మ‌కం, వేగం, మెరుగైన సేవ‌లు అత్యంత ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు ట్విట్ట‌ర్ బాస్.

ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా లేదా ఇంకే స‌మ‌స్య‌లు వ‌చ్చినా మొత్తం ట్విట్ట‌ర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ట్ర‌స్ట్ , సేఫ్టీ ప్రొడ‌క్ట్ ఎల్లా ఇర్విన్ చూస్తార‌ని స్ప‌ష్టం చేశారు ఎలాన్ మ‌స్క్. ఇదిలా ఉండ‌గా ట్విట్ట‌ర్ కంటెంట్ ను మోడ‌రేట్ చేసేందుకు ఆటోమేష‌న్ పై ఎక్కువ‌గా చూపుతోంది. నిర్దిష్ట మాన్యువ‌ల్ రివ్యూల‌ను తొల‌గిస్తోంది.

అక్టోబ‌ర్ చివ‌రలో సోష‌ల్ మీడియా కంపెనీని ఎలాన్ మ‌స్క్ కొనుగోలు చేసిన‌ప్ప‌టి నుంచి నిర్వ‌హ‌ణ‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.

Also Read : ఎక్క‌డికి వెళ్లినా ఇండియా నాతోనే ఉంటుంది

Leave A Reply

Your Email Id will not be published!