CSK vs RCB IPL 2022 : హ‌మ్మ‌య్య బోణీ కొట్టిన చెన్నై

ఆర్సీబీపై గ్రాండ్ విక్ట‌రీ

CSK vs RCB  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో వ‌రుస ప‌రాజయాల‌తో కునారిల్లుతున్న చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK vs RCB )కు ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది. లీగ్ మ్యాచ్ లో భాగంగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో బోణీ కొట్టింది.

మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన సీఎస్కే 23 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే 217 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 193 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

ఈ జ‌ట్టులో షాబాజ్ అహ్మ‌ద్ 41 ర‌న్స్ చేస్తే దినేశ్ కార్తీక్ 34, ప్ర‌భు దేశాయ్ 34 ర‌న్స్ తో రాణించారు. ఇక చెన్నై బౌల‌ర్ల‌లో తీక్ష‌ణ 4 వికెట్లు తీస్తే జ‌డేజా 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇక బ్రావో, ముకేష్ చౌద‌రి చెరో వికెట్ సాధించారు. అంత‌కు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 215 ప‌రుగులు చేసింది.

రాబిన్ ఊత‌ప్ప ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఏకంగా 50 బంతులు ఆడిన ఊత‌ప్ప 4 ఫోర్లు 9 సిక్స‌ర్లు కొట్టాడు. ఇక శివ‌మ్ దూబే 45 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో దుమ్ము రేపాడు . 95 ప‌రుగుగ‌ల‌తో నాటౌట్ గా నిలిచాడు.

ఈ ఇద్ద‌రూ ఆర్సీబీ(CSK vs RCB )బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఏకంగా మూడో వికెట్ కు 165 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఇక ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్ వుడ్ 1, హ‌స‌రంగా రెండు వికెట్లు తీశాడు. ఇవాళ మ‌రో కీల‌క మ్యాచ్ కు వేదిక కానుంది ఐపీఎల్ .

Also Read : సాహా ఆరోప‌ణ‌ల‌పై బీసీసీఐ విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!