Chetan Sharma BCCI : నమ్మకాన్ని కోల్పోయిన చేతన్ శర్మ
బీసీసీఐ రాజీనామా చేయాలని కోరలేదు
Chetan Sharma BCCI : నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఓ సామెత. అచ్చం ఇలాగే జరిగింది భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ స్టార్ పేసర్ , బీసీసీఐ చీఫ్ సెలెక్టర్. అద్బుతమైన హోదా. అంతకు మించిన గౌరవం, ఆపై సంతృప్తిని ఇచ్చే వేతనం, సౌకర్యాలు. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ క్రీడా సంస్థల్లో టాప్ ఆదాయం కలిగిన 10 సంస్థలలో బీసీసీఐ ఒకటి. అంతే కాదు భారత క్రికెట్ జట్టు ఎంపిక చేసే పవర్ ఫుల్ పోస్ట్ చీఫ్ సెలెక్టర్ పదవి.
ఇలాంటి కీలకమైన పదవిలో ఉన్న చేతన్ శర్మ(Chetan Sharma BCCI) సహనం కోల్పోయాడు. అడ్డదిడ్డంగా మాట్లాడాడు. రెండోసారి ఎంతో కష్టపడి చీఫ్ సెలెక్టర్ పదవిని అప్పగిస్తే తనంతకు తానుగా వెళ్లి పోయేలా చేసుకున్నాడు. ఇది ఒకరకంగా చెప్పాలంటే స్వయం కృతాపరాధం అని చెప్పక తప్పదు.
జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, వన్డే , టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, టి20 జట్టు స్కిప్పర్ హార్దిక్ పాండ్యా తో పాటు బీసీసీఐ కూడా చేతన్ శర్మను విశ్వాసంలోకి తీసుకోలేదు. చీఫ్ సెలెక్టర్ గా చేతన్ శర్మ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశాడు. విచిత్రం ఏమిటంటే తాను స్టింగ్ ఆపరేషన్ లో ఉన్నట్టు ఆయనకు తెలియదు. చివరకు బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీపై కూడా నోరు పారేసుకున్నాడు.
ఆపై రోహిత్ శర్మకు ప్రయారిటీ ఇచ్చాడని కోహ్లీని పక్కన పెట్టాడంటూ ఆరోపణలు చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గతంలో ఏనాడూ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లని చేతన్ శర్మ ఉన్నట్టుండి సహనం కోల్పోయాడు. చివరకు పదవి నుంచి తనంతకు తాను తప్పుకున్నాడు.
Also Read : బౌలర్ల ధాటికి ఆసిస్ 263 ఆలౌట్