Chetan Sharma Resigns : చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆమోదం
Chetan Sharma Resigns : భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ పేసర్ , బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ(Chetan Sharma Resigns) కోలుకోలేని షాక్ ఇచ్చాడు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన రాజీనామా లేఖను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జే షాకు పంపారు.
ఇదిలా ఉండగా ప్రముఖ దేశీయ ఛానల్ జీ మీడియా గ్రూప్ ఊహించని రీతిలో చేతన్ శర్మపై రహస్య ఆపరేషన్ (స్టింగ్ ఆపరేషన్ ) నిర్వహించింది. ఇందులో సెలెక్షన్ కమిటీ, మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకునే దానిపై నోరు జారాడు చేతన్ శర్మ.
ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో తన పదవికి తానే ముప్పు తెచ్చుకున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజీనామా చేయక తప్పలేదు చేతన్ శర్మ కు. ఈ స్టింగ్ ఆపరేషన్ లో కీలకమైన విషయాలు బయట పెట్టాడు.
అంతే కాదు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో చోటు చేసుకున్న పరిణామాలను బయట పెట్టాడు. బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య విభేదాల గురించి నోరు జారాడు. అంతే కాదు కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు అప్పగించడం వెనుక దాదా ప్రమేయం ఉందంటూ ఆరోపించాడు.
మొత్తంగా సంజూ శాంసన్ విషయంలో కూడా నోరు విప్పాడు. అతడిని ఎంపిక చేయక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయని పేర్కొన్నాడు చేతన్ శర్మ. మొత్తంగా కీలకమైన పదవి నుంచి తప్పుకోవడం(Chetan Sharma Resigns) చేతన్ శర్మకు కోలుకోలేని షాక్ ఇచ్చిందనే చెప్పక తప్పదు.
Also Read : ఆసియా కప్ నిర్వహణపై ఓకే – నజామ్ సేథీ