Chetan Sharma Row : ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్లు – చేతన్ శర్మ
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ షాకింగ్ కామెంట్స్
Chetan Sharma Row : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత క్రికెట్ లో చోటు చేసుకున్న రాజకీయాలను ఇవి ఒక్కసారిగా బయట పడేలా చేశాయి. ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కీలక విషయాలు వెల్లడించాడు. దీంతో బీసీసీఐలో ఇప్పుడు కలకలం మొదలైంది.
ప్రధానంగా ఆటగాళ్లు, బీసీసీఐ, ఎంపిక వ్యవహారం, ఏయే ఆటగాళ్లు ఎలా వ్యవహరిస్తారో కూడా కుండ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం చేతన్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర రాద్దాంతానికి దారి తీశాయి.
ఇదిలా ఉండగా జట్టులోకి రావాలంటే ముందు ఆటగాళ్లు తాము ఫిట్ నెస్ తో ఉన్నామని నిరూపించు కోవాల్సి ఉంటుంది. లేక పోతే ఎంపిక కారు. ఇందుకు గాను క్రికెటర్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని సంచలన ఆరోపణలు చేశాడు చేతన్ శర్మ(Chetan Sharma Row).
ఆయన చేసిన ఆరోపణలు అటు బీసీసీఐని ఇటు క్రికెటర్లలోనూ తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రధానంగా జస్ప్రీత్ బుమ్రా గురించి కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. చాలా మంది క్రికెటర్లు తమను జట్టు నుంచి తప్పిస్తారేమోనన్న ఆందోళన ఉంటుందని, అందుకుని ఇలాంటివి వాడుతుంటారని పేర్కొన్నాడు చేతన్ శర్మ.
అన్ ఫిట్ గా ఉన్న ఆటగాళ్లు ఇలాంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తారంటూ ఆరోపణలు చేశాడు. నకిలీ ఇంజెక్షన్లు తీసుకుంటారంటూ పేర్కొన్నాడు. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకోరంటూ చెప్పాడు. ఎందుకంటే డోపింగ్ లో పట్టుబడవచ్చని చెప్పాడు చేతన్ శర్మ(Chetan Sharma Row). విచిత్రం ఏమిటంటే డోప్ టెస్ట్ లో పట్టుబడని విధంగా తీసుకుంటారంటూ ఆరోపించాడు చీఫ్ సెలెక్టర్.
Also Read : పాక్ క్రికెటర్ల కంటే మనోళ్లకే ఎక్కువ