Pujara Guard Of Honor : పుజారాకు గౌర‌వ వంద‌నం

100వ టెస్టు ఆడుతున్న క్రికెట‌ర్

Pujara Guard Of Honor : ది నయా వాల్ గా పేరొందిన ఛ‌తేశ్వ‌ర్ పుజారాకు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌న క్రికెట్ కెరీర్ లో మ‌రిచి పోలేని రీతిలో గార్డ్ ఆఫ్ ఆన‌ర్ అందుకున్నాడు త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల నుంచి. స్వ‌దేశంలో నాలుగు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్ర‌వారం ఆస్ట్రేలియాతో 2వ టెస్టు ప్రారంభ‌మైంది.

ఇది ఛ‌తేశ్వ‌ర్ పుజారాకు ఇది 100వ టెస్టు. జ‌ట్టులోని స‌భ్యులంతా మైదానంలో పుజారాకు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. త‌న స‌హ‌చ‌రుల నుంచి గార్డ్ ఆఫ్ ఆన‌ర్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను , ఫోటోల‌ను ప్ర‌త్యేకంగా షేర్ చేసింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . 

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒక మైలు రాయి సంద‌ర్భంగా 100వ మ్యాచ్ కోసం భార‌త దేశానికి సంబంధించిన టెస్టు జెర్సీని ధ‌రించిన ఛ‌తేశ్వ‌ర్ పుజారా అరుణ్ జైట్లీ మైదానంలోకి వెళుతున్న స‌మ‌యంలో స‌హ‌చ‌ర క్రికెట‌ర్లు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పార‌ని పేర్కొంది బీసీసీఐ. భార‌త జ‌ట్టు మొత్తం పుజారాకు(Pujara Guard Of Honor) చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తం ప‌లికింది. ఈ సంద‌ర్భంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పుజారాను ప్ర‌త్యేకంగా అభినందించాడు.

పుజారా భార‌త క్రికెట్ కు చేసిన సేవ‌ల‌కు గాను భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ 100వ టెస్టు క్యాప్ ను అందుకున్నాడు.

ఇదిలా ఉండ‌గా పుజారా త‌న 100వ టెస్టులో సెంచ‌రీ చేసిన మొద‌టి బ్యాట‌ర్ గా అవ‌తరిస్తాడ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు గ‌వాస్క‌ర్. అనుభ‌వం క‌లిగిన పుజారా క‌ఠిన శ్ర‌మ‌కు, ఆత్మ విశ్వాసానికి రోల్ మోడ‌ల్ అని పేర్కొన్నాడు. అయితే 100 టెస్టుల మైలు రాయిని చేరుకున్న 13వ భార‌తీయ క్రికెట‌ర్ గా చ‌రిత్ర లో చోటు ద‌క్కించుకున్నాడు.

Also Read : చీఫ్ సెలక్ట‌ర్ చేతన్ శ‌ర్మ రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!