Cheteshwar Pujara : పుజారా పట్టు వదలని విక్రమార్కుడు
ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి తిరిగి ఎంపిక
Cheteshwar Pujara : భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్లకు ఉన్నంత డిమాండ్ ప్రపంచ క్రికెట్ లో ఏ జట్టుకు లేదంటే నమ్మలేం. ఎప్పుడైతే ది వాల్ ,
మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా అయ్యాడో ఆనాటి నుంచీ భారత జట్టు మరోసారి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
ప్రధానంగా లలిత్ మోడీ స్టార్ట్ చేసిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) ఇప్పుడు బీసీసీఐ సెలక్షన్ కమిటీకి ఓ వరంగా మారింది. ఈసారి యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు.
వారితో పాటు సీనియర్లు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లు దుమ్ము రేపారు. పూర్ పర్ ఫార్మెన్స్ తో జట్టులో స్థానం కోల్పోయిన పలువురు
ఆటగాళ్లకు చోటు దక్కేలా చేసింది ఐపీఎల్ 2022.
జాతీయ జట్టుకు దూరంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న బౌలర్
యజ్వేంద్ర చాహల్ , రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిద్యం వహిస్తున్న దినేశ్ కార్తీక్ కు మళ్లీ పిలుపు వచ్చింది.
భారత జట్టులో చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్ టూర్ లో 5 టెస్టుల సీరీస్ కు గాను 4 టెస్టులు మాత్రమే ఆడి కరోనా పేరుతో కోహ్లీ
సేన 5వ టెస్టు ఆడకుండానే చాప చుట్టేసింది. నేరుగా దుబాయ్ లో జరిగిన 2021 ఐపీఎల్ లో ఆడేందుకు వెళ్లింది.
అప్పట్లో పెద్ద రాద్దాంతమే జరిగింది. ఇక దేశీవాళి క్రికెట్ లో రాణించినా చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) అజింక్యా రహానేను పక్కన పెట్టేశారు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్. ఇదిలా ఉండగా కౌంటీ లో ఆడుతున్న పుజారా పరుగుల వరద పారించాడు.
పాకిస్తాన్ ఓపెనర్ రిజ్వాన్ తో కలిసి దుమ్ము రేపాడు. దీంతో మరోసారి ఇంగ్లండ్ తో జరిగే 5వ టెస్టుకు ఎంపిక చేశారు ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను.
Also Read : పాండ్యా సత్తా చాటాడు ఎంపికయ్యాడు