Chhattisgarh Encounter : బీజాపూర్ ఎన్కౌంటర్ లో 3 నక్సల్స్ హతం
గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వివరించారు...
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ముగ్గురు నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.భద్రతా బలగాలు నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో ఉండగా ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరాజ్ పి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు చెప్పారు. ఇరువైపుల నుంచి కాల్పులు నిలిచిపోగానే ఘటనా ప్రాంతం వద్ద యూనిఫాంతో ఉన్న ముగ్గురు నక్సల్ మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను కూడా ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వివరించారు.
Chhattisgarh Encounter Updates
కాగా,ఈ ఏడాది ఇంతవరకూ 12 మంది నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.జనవరి 6న నారాయణపూర్, దంతేవాడ, బిజాపూర్(Bijapur) జిల్లాల సరిహద్దుల్లో ఐదుగురు నక్సల్స్, జనవరి 9న సుక్మా జిల్లాలో ముగ్గురు నక్సల్స్ హతమయ్యారు. జనవరి 3న రాయపూర్ డివిజన్‌లోని గరియబండ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ హతమయ్యాడు. గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో 219 మంది నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
Also Read : Arvind Kejriwal : కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డాల్జి మాజీ సీఎం సవాల్