Wang Wenbin : నూపుర్ శ‌ర్మ కామెంట్స్ పై చైనా స్పంద‌న‌

అన్ని మ‌తాలు స‌మానం గౌర‌వించ‌డం ధ‌ర్మం

Wang Wenbin :  మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీ నుండి స‌స్పెండ్ కు గురైన నూపుర్ శ‌ర్మ పై స్పందించింది డ్రాగ‌న్ చైనా. ఈ మేర‌కు ఎట్ట‌కేల‌కు మౌనం వీడింది. అన్ని మ‌తాలు స‌మాన‌మేన‌ని గౌర‌వించ‌డం మ‌న ధ‌ర్మ‌మ‌ని పేర్కొంది.

ఆమె చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు ఎక్క‌డో ఒక చోట కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో ఒక్క యూపీలోనే 320 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. వంద‌లాది మందిపై కేసులు న‌మోదు చేశారు.

ఇక ఢిల్లీ జామా మ‌సీదు వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టిన వారిపై ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇక నూపుర్ శ‌ర్మ కామెంట్స్ పై భార‌త ప్ర‌భుత్వం క్ష‌మాప‌ణ చెప్పాలంటూ అర‌బ్ , ముస్లిం కంట్రీస్ తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి.

నూపుర్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇదే స‌మ‌యంలో నూపుర్ శ‌ర్మ అన్న‌దాంట్లో త‌ప్పేముందంటూ ప్ర‌శ్నిస్తున్నారు ఎంపీలు గౌతం గంభీర్, సాధ్వి ప్ర‌గ్యా రాజ్, మాజీ క్రికెట‌ర్ వెంక‌టేశ్ ప్ర‌సాద్.

ఇదిలా ఉండ‌గా 51 ముస్లిం దేశాలు మైనార్టీల‌కు భార‌త దేశంలో ర‌క్ష‌ణ లేకుండా పోయిందంటూ ఐక్య రాజ్య స‌మితికి లేఖ రాసింది. వారికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరింది.

ఈ త‌రుణంలో చైనా స్పందించ‌డం క‌ల‌కలం రేపింది. అన్ని మ‌తాలు, నాగ‌రిక‌త‌ల‌ను గౌర‌వించాల‌ని చైనా అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది.

ఈ మేర‌కు ప‌రిస్థితి కంట్రోల్ లోకి వ‌స్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు చైనా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి వాంగ్ వెన్బిన్(Wang Wenbin)  తెలిపారు.

Also Read : శమోదీపై కామెంట్స్ సీఇబి చైర్మ‌న్ రిజైన్

Leave A Reply

Your Email Id will not be published!