Mallikarjun Kharge : చైనా కళ్లద్దాలతో చూస్తే దేశం కనిపించదు
మోదీ బీజేపీ సర్కార్ పై ఏఐసీసీ చీఫ్ ఫైర్
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్, చైనా దేశాల మధ్య చోటు చేసుకున్న సరిహద్దు వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , బీజేపీ సర్కార్ సరైన రీతిలో స్పందించక పోవడం దారుణమన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చైనా గ్లాసులు ధరించి చూస్తే దేశంలో ఏం జరుగుతుందనేది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సరిహద్దు వద్ద భారత, చైనా దళాలు ఘర్షణ పడితే ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నించారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) . ఒక రకంగా దేశ ప్రజలను మభ్య పెట్టడం తప్ప మరొకటి కాదన్నారు.
తాము ఈ కీలకమైన అంశం గురించి చర్చించేందుకు వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టామని కానీ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. చైనా ఆక్రమణలపై ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతిపక్షాల డిమాండ్ పై పార్లమెంట్ లో ప్రతిష్టంభన నెలకొందని అన్నారు మల్లికార్జున్ ఖర్గే. మోదీ దేశంలో తయారైన కళ్లద్దాలతో కాకుండా చైనా కళ్లద్దాలతో చూస్తే ఏం కనిపిస్తుందంటూ ప్రశ్నించారు. భారత పార్లమెంట్ లోని ఉభయ సభల్లో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు అనుమతి లేదా అని నిలదీశారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) .
ఇదిలా ఉండగా బుధవారం లోక్ సభలో చర్చించాలని కోరినా స్పీకర్ అనుమతి ఇవ్వక పోవడంతో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో విపక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. కాగా ఖర్గే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : నెహ్రూపై కౌశల్ కిషోర్ షాకింగ్ కామెంట్స్