Chiranjeevi-PM Modi : ప్రధాని మోదీతో వీడియో కాన్ఫిరెన్సు పై చిరు కీలక ట్వీట్

మోదీ జీ #WAVES భారతదేశాన్ని ముందుకు నడిపిస్తారు..

Chiranjeevi : భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వాటిలో భాగంగా ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ (WAVES)’ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.

Chiranjeevi Tweet…

ఈ సమ్మిట్‌కు సంబంధించిన ప్రకటనపై, ప్రధాని మోడీ భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), బాలీవుడ్ స్టార్‌లు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి, అక్షయ్ కుమార్, హేమమాలినీ, దీపికా పదుకోణె పాల్గొన్నారు.

దక్షిణాది నుంచి రజనీకాంత్, నాగార్జున, ఎ. ఆర్. రెహమాన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. మోడీ తన సోషల్ మీడియాలో ఈ సమావేశం గురించి ప్రస్తావించారు.

ఈ సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. మోదీ జీ #WAVES భారతదేశాన్ని ముందుకు నడిపిస్తారు అని నాకు ఎటువంటి సందేహం లేదు” అని ట్వీట్ చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో భారత వ్యాపార దిగ్గజాలు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా పాల్గొన్నారు. వారు వేవ్స్ సమ్మిట్‌పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Also Read : CM Omar Abdullah : ఢిల్లీ ఫలితాలపై కాశ్మీర్ సీఎం సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!