CIA Director : రష్యన్లపై మోదీ ఎఫెక్ట్ – సీఐఏ చీఫ్
ప్రపంచ విపత్తు నివారించే ఛాన్స్
CIA Director : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ బిల్ బర్న్స్(CIA Director) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ పై రష్యా కంటిన్యూగా దాడులకు దిగుతోంది. ఓ వైపు అమెరికాతో పాటు ఇతర దేశాలు సైతం దాడులు ఆపాలని చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు.
కానీ రష్యాతో సత్ సంబంధాలు నెరుపుతూ వస్తున్న ఏకైక దేశం భారత్ . ప్రధానంగా చైనాతో బంధం ఉన్నప్పటికీ అది తాత్కాలికమేనని పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పుడు ఉక్రెయిన్ పై యుద్దాన్ని నివారించే సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీకి మాత్రమే ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఐఏ చీఫ్.
ఇదిలా ఉండగా యుద్దం ప్రారంభమైన నాటి నుంచి శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించు కోవాలని భారత్ కోరుతోంది. ఇదే సమయంలో తాము యుద్దానికి వ్యతిరేకమని పేర్కొంటూ వచ్చింది. భారత దేశం ప్రధానంగా సంభాషణ, దౌత్యం కోసం పిలుపు ఇచ్చింది.
ఇదిలా ఉండగా సీఐఏ చీఫ్(CIA Director) కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అణ్వాయుధాల వినియోగంపై ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయాలు రష్యన్లపై పెను ప్రభావం చూపాయన్నారు. ఉక్రెయిన్ యుద్ద సందర్భంలో ప్రపంచ విపత్తును నివారించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు బిల్ బర్న్స్ .
జిన్ పింగ్ , మోదీ ఇద్దరూ అణ్వాయుధాల ఆందోళనల గురించి లేవనెత్తడం వల్ల మేలు జరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. అయితే పుతిన్ మాత్రం కొంత తగ్గినట్టు అనిపించినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఇదే సమయంలో భారత్ తో ఆయన చిరకాల మైత్రిని కొనసాగించేందుకే ఇష్ట పడుతున్నారు.
Also Read : శక్తి వంతమైన యుద్ద నౌక మోర్ముగావో