CJI Chandrachud : నేను రేపటి నుంచి న్యాయం చేయలేనంటూ భావోద్వేగానికి గురైన సీజేఐ

ఈరోజు ఆయన తన పదవికి వీడ్కోలు పలుకుతున్నారు...

CJI Chandrachud : భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్(CJI Chandrachud) కి ఇది చివరి రోజు కానుంది. ఇటీవల ఆయన పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతల నుంచి జస్టిస్ చంద్రచూడ్ తప్పుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చివరి సారిగా సీజేఐ హోదాలో ఆయన తన ప్రసంగాన్ని వినిపించారు. రేపటి నుంచి నేను తీర్పులు జారీ చేయలేను.. కానీ, నేను సంతృప్తిగా ఉన్నాను అంటూ ఆయన అన్నారు.

CJI Chandrachud Comment

2022,నవంబర్ 9న పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్(CJI Chandrachud) రెండేళ్ల పదవీకాలం ఈరోజు(శుక్రవారం)న ముగిసింది. ఈరోజు ఆయన తన పదవికి వీడ్కోలు పలుకుతున్నారు. మొన్న సాయంత్రం తన రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌తో జరిగిన ఓ మధురమైన క్షణాన్ని సీజేఐ గుర్తుచేసుకుంటూ, “సెరిమోనియల్‌ని ఎప్పుడు ప్రారంభించాలని నా రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌ని అడిగినప్పుడు, పెండింగ్‌లో ఉన్న చాలా వస్తువులను తీసుకునే వీలు కల్పిస్తుందని భావించి మధ్యాహ్నం 2 గంటలకని చెప్పాను. కానీ ఆ తర్వాత నాకే సందేహంగా అనిపించింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎవరైనా వస్తారా లేదా నన్ను నేనే తెరపై చూసుకోవాల్సి వస్తుందా అని అనిపించింది అని అన్నారు.

తనకెరీర్‌ను ప్రతిబింబిస్తూ.. న్యాయమూర్తుల పాత్ర యాత్రికులతో సమానమని, సేవ చేయాలనే నిబద్ధతతోనే తాము కూడా ప్రతిరోజూ కోర్టుకు వస్తుంటామని వివరించారు. మనం చేసే పని వల్ల కేసులు బనాయించవచ్చు లేదా పరిష్కరించవచ్చు అని ఆయన అన్నారు.’’ఈ న్యాయస్థానాన్ని అలంకరించిన గొప్ప న్యాయమూర్తులకు నివాళులు అర్పిస్తున్నాను. జస్టిస్ సంజీవ్ ఖన్నా వంటి సమర్థుల చేతుల్లో ధర్మాసనాన్ని బదిలీచేయడం నాకెంతో భరోసానిచ్చింది‘‘ అంటూ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

Also Read : Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మరో సంచలన అప్డేట్

Leave A Reply

Your Email Id will not be published!