CJI DY Chandrachud : స్వతంత్ర పత్రికా వ్యవస్థ అవసరం – సీజేఐ
ధనంజయ చంద్రచూడ్ షాకింగ్ కామెంట్స్
CJI DY Chandrachud : బలమైన ప్రజాస్వామ్యానికి స్వతంత్ర పత్రికా వ్యవస్థ (ఇండిపెండెంట్ ప్రెస్) అత్యంత అవసరమని స్పష్టం చేశారు భారత దేశ పర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్(CJI DY Chandrachud). మలయాళ న్యూస్ ఛానెల్ మీడియా వన్ పై కేంద్ర సర్కార్ నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసును బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.
టీవీ ఛానెల్ లైసెన్స్ ను రద్దు చేసేందుకు ప్రభుత్వాన్ని విమర్శించడం కారణం కాదని పేర్కొంది. కేంద్రం విధించిన నిషేధం చెల్దని కుండ బద్దలు కొట్టింది. సదరు ఛానెల్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించడాన్ని కేంద్రాన్ని తప్పు పట్టింది.
ఉగ్రవాద సంబంధాలను చూపించేందుకు ఏమీ లేదు. గాలి ఆధారంగా జాతీయ భద్రతా వాదనలు చేయకూడదు. ఏ ఒక్క అంశం కూడా జాతీయ భద్రతకు విరుద్దం లేదా ప్రజా శాంతి భద్రతలకు ముప్పు కలిగించేది కాదని చంద్రచూడ్(CJI DY Chandrachud) ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ప్రెస్ విధిగా మద్దతు ఇవ్వాలనే రూల్ ఏమీ లేదు.
ప్రభుత్వంపై విమర్శలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారా ఇదెక్కడైనా ఉందా అని ప్రశ్నించింది ధర్మాసనం. ప్రజాస్వామ్య గణతంత్రం పటిష్ట పనితీరుకు స్వతంత్ర పత్రికా వ్యవస్థ అవసరం. ప్రజాస్వామ్య సమాజంలో దాని పాత్ర కీలకమైనది. ఎందుకంటే తప్పు ఒప్పులను చెప్పే ఏకైక సాధనం పత్రికా, ప్రసార వ్యవస్థలేనని గుర్తుంచు కోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు సీజేఐ చంద్రచూడ్.
Also Read : మీడియా వన్ ఛానెల్ నిషేధం చెల్లదు