CJI Governor Comment : పడిపోతూ ఉంటే చూస్తూ ఉంటారా
కోష్యారీ నిర్వాకంపై సీజేఐ ఆగ్రహం
CJI Governor Comment : మరోసారి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు ఆలోచింప చేసేలా ఉంటున్నాయి. గతంలో కూడా సీజేఐ సంచలన తీర్పులు వెలువరించారు. ఆయన కొలువు తీరాక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిసారి ఇబ్బందికి గురవుతోంది.
ఇప్పటికే న్యాయమూర్తల ఎంపిక విషయంలోనూ, కొలీజియం వ్యవస్థపై, కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎంపిక పై ఇలా ప్రతి దానిలోనూ పారదర్శకత ఉండేలా చూస్తూ వచ్చారు. సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే కింది స్థాయిలో వ్యవస్థలు బలంగా పని చేస్తాయని స్పష్టం చేశారు.
యావత్ ప్రపంచం ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం అవుతోంది. మనం కూడా దానితో మమేకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు సీజేఐ. ఇదే సమయంలో శివసేన వర్సెస్ షిండే సేనకు చెందిన కేసు వివాదం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్బంగా సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా సీజేఐ అడిగిన ప్రశ్నలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు కలకలం రేపుతున్నాయి.
దేశంలో గవర్నర్ల వ్యవస్థ అత్యంత చర్చకు దారి తీస్తున్న సమయంలో చంద్రచూడ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశానికి రాష్ట్రపతి, రాష్ట్రాలకు గవర్నర్లు రాజ్యాంగానికి రక్షకులు. వారికి అపారమైన అధికారులు ఉంటాయి.
ఇదే సమయంలో పరిమితులు ఉంటాయి. కానీ ఒక ప్రేక్షకుడిగా ఉండాలే తప్పా తానే రాజకీయాలతో రాసుకు పూసుకు తిరగ కూడదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉంటుంది.
ఇదే సమయంలో తను భరోసా ఇవ్వగలగాలి. ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్ము కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా గవర్నర్ దే. అయితే ప్రభుత్వం ఏం చేస్తోందనేది కూడా ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
కానీ పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం క్షమించరాని నేరం అని స్పష్టం చేశారు జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్(CJI Governor Comment).
ఒక రకంగా ఆనాటి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన నిర్వాకం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విశ్వాస ఓటు అనేది ఎప్పుడు ప్రకటించాలో కూడా తెలుసు కోవాల్సిన బాధ్యత రాష్ట్ర రక్షకుడికి లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థలు ఇలా కళ్ల ముందు కూలి పోతూ ఉంటే ఇంక ఎలా ప్రజాస్వామ్యం మనగలుగుతుంది అని నిలదీశారు.
ఒక రకంగా కోట్లాది ప్రజలు ఏమని అనుకుంటున్నారో కూడా తన మాటల్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా సీజేఐ చేసిన వ్యాఖ్యల్ని గమనంచాలి. విశ్వాస తీర్మానం కోసం పిలుపునిస్తే ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందని గవర్నర్ కు ఎరుక కలిగి ఉండాలన్నారు.
ఈ సమయంలోనే గవర్నర్ పనితనం, నిబద్దత , చతురత బయట పడుతుందన్నారు. ప్రభుత్వ పతనానికి దారితీసే ఏ ప్రాంతాంలోనూ గవర్నర్(CJI Governor) ప్రవేశించ కూడదని హెచ్చరించారు జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. ఈ మొత్తం వ్యవహారం గవర్నర్లకు ఒక రకంగా వార్నింగ్ లాంటిదని చెప్పక తప్పదు.
Also Read : ఢిల్లీలో ప్రతిపక్షాల మానవహారం