CJI To Hear : సిసోడియా అభ్యర్థన సీజేఐ విచారణ
అరెస్ట్ అక్రమమంటూ పిటిషన్ దాఖలు
CJI To Hear Sisodia Plea : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్ట్ కు వ్యతిరేకంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తాను మద్యం పాలసీ తయారు చేశానని, దానిపై సంతకం చేసింది మాత్రం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆనాటి లెఫ్టినెంట్ గవర్నర్ దేనంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా మంగళవారం దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు ఓకే చెప్పారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన సూత్రధారి అంటూ సీబీఐ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 34 మందిపై అభియోగాలు మోపింది. వీరిలో 10 మందిని అరెస్ట్ చేసింది. ఆదివారం విచారణకు హాజరైన సిసోడియాను(Sisodia) కేంద్ర దర్యాప్తు సంస్థ 8 గంటలకు పైగా విచారణ చేపట్టింది.
కానీ తమకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. రాత్రి అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం కోర్టులో హాజరు పర్చింది. తమకు 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. కోర్టు ఒప్పుకోలేదు 5 రోజులు ఇచ్చింది.
దీనిని సవాల్ చేస్తూ మనీష్ సిసోడియా కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 3.45 నిమిషాలకు సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్ విచారణ (CJI To Hear Sisodia Plea) చేపడతానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎలాంటి తీర్పు రాబోతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Also Read : మాజీ ఎల్జీ పై విచారణ జరిపించాలి – ఆప్