Rajiv Killers Release : రాజీవ్ హంతకుల విడుదలపై దావా
సుప్రీంకోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ సవాల్
Rajiv Killers Release : దేశ వ్యాప్తంగా కలకలం రేగింది దేశ మాజీ ప్రధాన మంత్రి, దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదుకు గురైన నిందితులను సుప్రీంకోర్టు విడుదల చేయడం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయనుంది.
తమిళనాడులోని ఒక మహిళతో సహా ఆరుగురిని జైలు నుంచి విడుదల(Rajiv Killers Release) చేసిన తర్వాత ఈ ఉత్తర్వును సమీక్షించాలని కోరుతూ కేంద్రం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా ఖైదీల సత్ ప్రవర్తన ఆధారంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఇదిలా ఉండగా రాజీవ్ హంతకులు విడుదలైన పది రోజుల తర్వాత సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ తాజా సమీక్ష దరఖాస్తును దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. హంతకులను విడుదల చేయడం దురదృష్టకరమని, ఆమోద యోగ్యం కాదని గతంలోనూ పార్టీ పేర్కొంది.
ఈ ఉద్వేగ భరితమైన రాజకీయ అంశంలో బీజేపీ పాలిత కేంద్రం , కాంగ్రెస్ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఇదిలా ఉండగా నలుగురు దోషులకు మరణ శిక్ష విధించడాన్ని రాజీవ్ గాంధీ భార్య, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమర్థించారు.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా నిందితులలో ఒకరిని కలుసుకున్నారు. ఆమెను క్షమించారు. కాగా పార్టీ నాయకత్వం గాంధీలతో విభేదించి తీవ్రంగా స్పందించింది.
Also Read : రాజకీయం ‘పాదయాత్ర’ల కాలం