Chaos AAP BJP : ఆప్..బీజేపీ సభ్యుల మధ్య తోపులాట
స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రసాభాస
Chaos AAP BJP : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రసా భాసగా మారింది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఆప్ అభ్యర్థులు షీలా ఒబెరాయ్ , మహమ్మద్ ఇక్బాల్ ఎన్నికయ్యారు. గతంలో మూడుసార్లు వాయిదా పడ్డాయి.
చివరకు ముగిసినా స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఎన్నికల్లో ప్రజలు విజయం సాధించారంటూ కామెంట్ చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అర్ధరాత్రి వరకు హై డ్రామా చోటు చేసుకుంది. సీసాలు, బ్యాలట్ బాక్స్ లు ఎగిరి పోవడం విస్తు పోయేలా చేసింది. చివరకు సభ్యులు కొట్టుకునేంత దాకా వెళ్లడం జరిగింది.
ఢిల్లీలోని ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యంత శక్తివంతమైన సంస్థగా భావించే స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యుల ఎంపిక తీవ్ర వివాదానికి దారి తీసింది. నిన్న సాయంత్రం మొదలైన డ్రామా గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఎనిమిదిసార్లు సభ వాయిదా పడింది. ఎన్నికల సమయంలో బీజేపీ కౌన్సిలర్లు తనపై దాడి చేశారంటూ ఢిల్లీ కొత్త మేయర్ షెల్లీ ఒబేరాయ్ ఆరోపించారు.
అయితే మేయర్ తో చర్చించేందుకు మాత్రమే తాము ప్రయత్నించామని బీజేపీ తెలిపింది. అయితే బీజేపీకి చెందిన కౌన్సిలర్లు వేదికపైకి ఎక్కి మేయర్ ను చుట్టుముట్టిన దృశ్యాలు బయట పడ్డాయి. దీనిపై సీరియస్ గా స్పందించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆప్ కు చెందిన అతిషి తెలిపారు. ఓటింగ్ సమయంలో కొందరు సభ్యులు సెల్ ఫోన్లు తీసుకు వెళుతున్నారనే ఆరోపణలపై ఆప్ , బీజేపీ(Chaos AAP BJP) మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని సమాచారం.
Also Read : లా ప్యానెల్ పదవీ కాలం పొడిగింపు