Bhagwant Mann : అగ్నిపథ్ స్కీంను విరమించుకోండి – సీఎం
యువతలో ఆగ్రహం దేశానికి మంచిది కాదు
Bhagwant Mann : కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంను వెంటనే విరమించు కోవాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann) డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా యువతలో ఆగ్రహం వ్యక్తం అవుతోందని, ఇది అత్యంత ప్రభావం చేసే ప్రమాదం ఉందన్నారు.
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే బీహార్, యూపీ, హర్యానా, తెలంగాణ, తదితర రాష్ట్రాలలో నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయని ఇది రాను రాను ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు.
ఈ మేరకు తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాస్తానని తెలిపారు సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann). శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
దేశం కోసం అభిరుచితో పని చేయాలని అనుకునే వారికి దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని కోరారు.
ముందస్తు చర్చలు జరపకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల దుష్పరిణామాలు కలుగుతాయని తెలుసు కోవాలని సూచించారు.
దేశంలో ఇప్పటి వరకు 70 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క సాయుధ దళాలలోనే 70 వేలకు పైగా ఖాళీగా ఉండడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
దేశాభివృద్ధిలో యువత కీలకం కానున్నారు. అంతే కాదు ఇవాళ దేశ భద్రతను కాపాడడంలో వారి పాత్ర అత్యంత ముఖ్యమన్నారు భగవంత్ మాన్.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తను తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీం పై పునరాలోచించు కోవాలని, బేషరత్తుగా విరమించు కోవాలని సీఎం డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : ‘అగ్నిపథ్ స్కీం’ ప్రమాదం – రాహుల్