Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’
ప్రకటించిన బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వం
Puneeth Rajkumar : ప్రముఖ కన్నడ సినీ నటుడు, దివంగత పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) కు మరణాంతరం అత్యున్నతమైన కర్ణాటక రత్న అవార్డును ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ఈ పురస్కారాన్ని నవంబర్ 1న ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై వెల్లడించారు.
బెంగళూరులో సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు దివంగత నటుడికి రాష్ట్ర సర్కార్ ఇచ్చే అత్యున్నత అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా ఆయా రంగాలలో విశిష్ట సేవలు అందించినందుకు గాను రాష్ట్ర సర్కార్ ఎంపిక చేస్తుంది. ఈ అత్యున్నత పౌర పురస్కారం గత ఏడాది అక్టోబర్ 29, 2021న మరణించిన రాజ్ కుమార్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడం పునీత్ రాజ్ కుమార్ 10వ వ్యక్తి. ఇదిలా ఉండగా గతంలో పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు 1992లో కర్ణాటక రత్న పురస్కారం అందజేసింది.
కాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కర్నాటక రత్న అవార్డును కర్ణాటక రాజ్యోత్సవం లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున విధాన సౌధ ముందు జరిగే కార్యక్రమంలో అందజేస్తారు పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి. అంతకు ముందు సీఎం బొమ్మై అధ్యక్షతన జరిగిన సమావేశంలో కర్ణాటక రత్న పురస్కారం అంశంపై చర్చించారు.
ఈ అవార్డును ముందుగా ప్రకటించినప్పటికీ తాజాగా ఖరారు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమ, కన్నడ భాష, సంస్కృతికి పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
Also Read : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త